News October 3, 2025
జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ప్రకాశం SP

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని శుక్రవారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా సందర్శించి, పలు విభాగాల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలోని పూర్తి విభాగాలను రికార్డులను ఎస్పీ తనిఖీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. రికార్డులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేయాలని సూచించారు. సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలన్నారు.
Similar News
News October 3, 2025
కనిగిరి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్

కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 3 నెలలపాటు నిరుద్యోగ యువతీ, యువకులకు అసిస్టెంట్ ఎలక్ట్రిషన్, జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని 17- 45 ఏళ్లవారు వినియోగించుకోవాలని ప్రిన్సిపాల్ ఉషారాణి తెలిపారు. సాఫ్ట్వేర్ డెవలపింగ్‌లో రూ.లక్ష వరకు జీతాలు ఉంటాయన్నారు. వివరాలకు 8008822821 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
News October 2, 2025
ప్రకాశం: టిప్పర్‌ను ఢీకొన్న బైక్.. ఇద్దరు స్పాట్‌డెడ్

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరుగుమల్లి శివారులో ఉన్న పాలకేంద్రం సమీపంలో రోడ్డు మార్జిన్‌లో టిప్పర్ నిలిపి ఉంది. కామేపల్లి నుంచి టంగుటూరు వైపు బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు నిలిపి ఉన్న టిప్పర్‌ను గమనించక వెనక వేగంగా గుద్దారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా వీరిద్దరు జరుగుమల్లి మండలం చింతలపాలెం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
News October 2, 2025
గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు: SP

గాంధీ ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నారు. ఒంగోలులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో గురువారం మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించిన ఎస్పీ, కార్యాలయంలోని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గాంధీజీ దేశానికి చేసిన సేవలపై ఎస్పీ ప్రసంగించారు.