News September 6, 2025
జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ

రిక్రూట్ కానిస్టేబుళ్ల శిక్షణ త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ వీఎన్. మణికంఠ చందోలు శనివారం చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఎస్పీ బ్యారక్స్, డైనింగ్ హాల్, కిచెన్, వైద్య సదుపాయాలు, సీసీ కెమెరా పర్యవేక్షణ వంటి విభాగాలను సమగ్రంగా పరిశీలించారు. రిక్రూటర్లుకు పరిశుభ్ర వాతావరణం, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రతా చర్యలు అత్యుత్తమంగా ఉండాలని తెలిపారు.
Similar News
News September 5, 2025
గురువులు సమాజ నిర్దేశకులు: చిత్తూరు MLA

గురువుల సమాజ నిర్దేశకులని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో వారి కృషి మరువలేనిదని కొనియాడారు. గురువులకు ఎప్పుడు సమాజంలో ఉన్నత స్థానం ఉంటుందని తెలియజేశారు.
News September 5, 2025
7న కాణిపాకం ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం వరసిద్ధుడి ఆలయాన్ని ఈనెల 7వ తేదీ సాయంత్రం 4గంటల నుంచి మూసి వేయనున్నట్లు ఈవో పెంచలకిషోర్ వెల్లడించారు. గ్రహణం విడిచిన తర్వాత 8వ తేదీ ఉదయం 4 గంటలకు ఆలయం శుద్ధి చేస్తామన్నారు. స్వామికి అభిషేకం చేసి ఉదయం 6గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. కాణిపాకంలోని మణికంఠేశ్వరస్వామి, వరదరాజస్వామి ఆలయాలను సైతం క్లోజ్ చేస్తారు.
News September 5, 2025
చిత్తూరు జిల్లాలో ఇంటర్ పూర్తి చేశారా?

చిత్తూరు జిల్లాలో ఉచిత పారామెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. ఇంటర్‌లో 40శాతం మార్కులతో పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి ఉన్న ఈనెల 8వ తేదీలోపు అఫ్లికేషన్ ఫిల్ చేసి చిత్తూరులోని DMHO ఆఫీసులో సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు www.appmb.co.in వెబ్‌సైట్ చూడాలన్నారు.