News December 22, 2025

జిల్లా పోలీస్ PGRSకు 85 ఫిర్యాదులు

image

జిల్లా పోలీసు ప్రాధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో SP సతీష్‌కుమార్ 85 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రతి పిటిషనర్ సమస్యను సంబంధిత స్టేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధితులకు పోలీసులపై నమ్మకం పెరిగేలా అర్జీల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు. కుటుంబ కలహాలు, ఆస్తి, ఆర్థిక వివాదాలు, భూ సమస్యలు, వ్యక్తిగత, సామాజిక అంశాల ఫిర్యాదులను పరిశీలించామన్నారు.

Similar News

News December 23, 2025

Rewind 2025: రిటైర్ అయిన ప్రముఖ క్రికెటర్లు

image

*విరాట్ కోహ్లీ మే 12న టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. తన 14 ఏళ్ల కెరీర్‌లో 9,230 రన్స్ చేశారు.
*రోహిత్ శర్మ మే 7న టెస్టులకు గుడ్‌బై చెప్పారు. 2013లో అరంగేట్రం చేసిన హిట్‌మ్యాన్ 4,301 రన్స్ చేశారు.
*పుజారా ఆగస్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అతడు 103 టెస్టుల్లో 7,195 రన్స్ చేశారు.
*రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా, వృద్ధిమాన్ సాహా సైతం తప్పుకున్నారు.

News December 23, 2025

రొమ్ము క్యాన్సర్‌కు నానో ఇంజెక్షన్

image

రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళలకు IIT మద్రాసు గుడ్ న్యూస్ చెప్పింది. AUS పరిశోధకులతో కలిసి ‘కట్టింగ్ ఎడ్జ్ నానో ఇంజెక్షన్ డ్రగ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్’ను డెవలప్ చేసింది. ఈ నానో ఇంజెక్షన్‌తో యాంటీ క్యాన్సర్ డ్రగ్ ‘డోక్సోరుబిసిన్’ను నేరుగా క్యాన్సర్ కణాల్లోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కీమోథెరపీ, రేడియేషన్ పద్ధతుల వల్ల క్యాన్సర్ కణాలతో సంబంధంలేని ఇతర భాగాలపై ప్రభావం పడుతోంది.

News December 23, 2025

వింటర్‌లో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

image

శీతాకాలంలో ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల గర్భిణులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినడం మానుకోండి. తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెకప్‌లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.