News October 7, 2025

జిల్లా ప్రజలకు ఎస్పీ సూచనలు..!

image

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ బీ ఉమామహేశ్వర్ మంగళవారం పలు సూచనలు చేశారు. తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దన్నారు. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని సూచించారు. అధికారిక యాప్‌లను మాత్రమే డౌన్లోడ్ చేసుకుని, వాటికి స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉపయోగించాలని పేర్కొన్నారు.

Similar News

News October 7, 2025

వరంగల్: ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఎనుమాముల మార్కెట్ యార్డులో పరిశీలించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ హాళ్లు, స్ట్రాంగ్ రూమ్‌లు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, నీటి, టాయిలెట్ సౌకర్యాలను పరిశీలించారు. కౌంటింగ్ హాళ్లలో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

News October 7, 2025

జూబ్లీహిల్స్ బై పోల్స్.. టీడీపీ ఓటు బ్యాంకుపై నేతల ఆరా

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇపుడు అందరి చూపూ ఓటు బ్యాంకుపైనే ఉంది. ఏయే పార్టీలకు ప్రజలు మద్దతిస్తారనే విషయంపైనే నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆ తరువాత బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అయితే ఇంకా టీడీపీకి ఓటు బ్యాంకు ఉందని నాయకులు నమ్ముతున్నారు. సైకిల్ పార్టీకి ఎన్ని ఓట్లు ఉంటాయని ఆరా తీస్తున్నారు.

News October 7, 2025

NGKL: మైనర్‌ వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

image

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీలోని సాయి నగర్ కాలనీలో జరుగుతున్న మైనర్ బాలిక వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సీడబ్ల్యూసీ (CWC) సభ్యుల సమాచారంతో, అచ్చంపేట ఎస్సై ఇందిర, షీ టీం బృందాలు అక్కడకు చేరుకున్నారు. బాల్య వివాహం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించి, కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలిక భవిష్యత్తు దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.