News December 31, 2025

జిల్లా ప్రజలకు కలెక్టర్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు

image

నిర్మల్ జిల్లా ప్రజలకు, అధికారులకు కలెక్టర్ అభిలాష అభినవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ప్రజలందరికీ శుభం కలగాలని ఆమె ఆకాంక్షించారు. గడిచిన ఏడాదిలో అందరి సహకారంతో జిల్లా మెరుగైన ప్రగతి సాధించిందని, రాబోయే సంవత్సరంలో మరింత ఉత్సాహంతో పని చేసి నిర్మల్‌ను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

Similar News

News January 2, 2026

పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేసిన కలెక్టర్

image

రాజముద్రతో ఉన్న పట్టాదారు పాసుపుస్తకాలను జిల్లాలోని రైతులకు అందజేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. గుడిపాల మండలం వసంతాపురం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామసభలో ఆయన పాల్గొన్నారు. ఈనెల తొమ్మిది వరకు జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో గ్రామసభలు నిర్వహించి నూతన పుస్తకాలను అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

News January 2, 2026

అయిజ: యూరియా కొరత లేదు- జిల్లా వ్యవసాయ అధికారి

image

గద్వాల జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్ పేర్కొన్నారు. శుక్రవారం అయిజలో పర్యటించి పలు ఫర్టిలైజర్స్ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేశారు. యూరియా, ఎరువుల నిల్వలను పరిశీలించారు. స్టాక్ ఉన్నంతవరకు రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు విక్రయించాలని డీలర్లకు సూచించారు. యూరియా కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి అపోహలు నమ్మవద్దని తెలిపారు. ఏఈఓ శ్రీకాంత్ పాల్గొన్నారు.

News January 2, 2026

ఎల్లుండి చిరంజీవి కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్

image

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా ట్రైలర్‌ను ఈనెల 4న రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ తెలిపింది. చిరంజీవి గన్ పట్టుకున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నయనతార హీరోయిన్‌గా, విక్టరీ వెంకటేశ్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 12న థియేటర్లలోకి రానుంది. భీమ్స్ మ్యూజిక్ అందించారు.