News October 2, 2025

జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డా. అజిత వేజెండ్ల విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని ప్రజలకు శ్రీ దుర్గా మాత ఆశీస్సులు ఉండాలని, సకల శుభాలు ఆయురారోగ్యాలు కలగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని ఆ దుర్గ భవాని ఆశీస్సులు అందరికీ కలగాలని కోరారు.

Similar News

News October 2, 2025

నెల్లూరు: తగ్గనున్న విద్యుత్ చార్జీలు

image

ఎన్నికల వేళ విద్యుత్తు బిల్లులు పెంచబోమని ఇచ్చిన హామీని కూటమి నేతలు నిలబెట్టుకున్నారు. తాజాగా ట్రూ డౌన్ సమీక్షలో జిల్లా వినియోగదారులపై రూ.32 కోట్లు భారం తగ్గనుంది. జిల్లాలో 12,37,429 కనెక్షన్లు ఉండగా రోజుకు సుమారు 13 మిలియన్ యూనిట్లు వినియోగమవుతున్నాయి. గతంలో యూనిట్‌కు అదనంగా 40 పైసలు వసూలు చేసిన చోట, ఇకపై 13 పైసలు తగ్గింపు లభించనుంది. నవంబరు బిల్లుల నుంచే అమలు జరగనుందని SE కే.రాఘవేంద్ర తెలిపారు.

News October 2, 2025

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా మిథున్‌ రెడ్డి

image

నెల్లూరు జిల్లా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా పీవీ మిథున్‌ రెడ్డి ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. నెల్లూరు జిల్లాతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే మిథున్‌ రెడ్డి బెయిల్‌పై విడుదల కావడంతో ఆయా జిల్లాల బాధ్యతలు తిరిగి ఆయనకే అప్పగిస్తూ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు.

News October 2, 2025

గాంధీ జయంతి రోజున పొదలకూరులో ఆగని జీవహింస

image

గాంధీ జయంతి (డ్రై-డే), దసరా రెండూ ఒకే రోజు రావడంతో గురువారం పొదలకూరు మాంస వ్యాపారులు ఈ రోజు డ్రై-డే అన్న సంగతే మర్చిపోయారు.. సాధారణంగా ప్రతి ఏడాది అక్టోబర్-2 గాంధీ జయంతిని పురస్కరించుకొని మద్యం, జీవహింస నిషేదిస్తారు. ఆ దిశగా అధికారులు వ్యాపారులకు ముందస్తు సమాచారం అందిస్తారు. కానీ ఈ దఫా అవేమి జరిగినట్లు లేదు. దీనితో యథేచ్ఛగా మాంసం విక్రయాలు చేస్తున్నారు.