News January 12, 2025
జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్
మూడు రోజులు పాటు జరిగే సంక్రాంతి పర్వదిన సందర్భంగా జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు బాగా పండి రైతులు ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరారు. జిల్లా అధికార యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి ఫలాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలని కోరారు.
Similar News
News January 12, 2025
పండుగ సమయంలో ఎస్పీ కీలక సూచనలు
సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో పట్టణ ప్రాంతాల నుంచి ఊళ్లకు ప్రయాణం చేసే వారి పట్ల నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ పలు సూచనలు చేశారు. ప్రయాణం సమయంలో బ్లాక్ స్పాట్, యాక్సిడెంట్ జోన్ వంటి బోర్డులు గమనించాలన్నారు. రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారు పొగ మంచు, రోడ్డుకు అడ్డంగా జంతువులు ఉన్న విషయాలను గమనించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్స్ డ్రైవింగ్ నిషేధమన్నారు.
News January 12, 2025
భోగి మంట వేస్తున్నారా?
సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్ను వే2న్యూస్లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.
News January 12, 2025
తిరుమల పరకామణిలో దొంగతనం
తిరుమల పరకామణిలో టీటీడీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి శ్రీవారి హుండీలో బంగారం దొంగతనం చేశారు. అగ్రిగోస్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పెంచలయ్య100 గ్రాముల గోల్డ్ బిస్కెట్ ట్రాలీలో దాచి తీసుకువెళుతుండగా విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఘటనపై తిరుమల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, అతను గతంలో కూడా ఏమైనా దొంగతనాలు చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు.