News December 26, 2025
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ నరేశ్

బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సీహెచ్. నరేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. అనంతరం సంబంధితశాఖ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News December 28, 2025
నిర్మలా సీతారామన్‌కు సైకత శిల్పంతో స్వాగతం

నరసాపురం మండలం పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా సముద్ర తీరంలో ఆమె గౌరవార్థం ఏర్పాటు చేసిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. ‘గ్రామ అభివృద్ధి ప్రదాత నిర్మలా సీతారామన్‌కు సుస్వాగతం’ అంటూ రూపొందించిన సైకత శిల్పాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తీర ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సైకత శిల్పం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
News December 28, 2025
అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభం

AP: తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్‌ను ప్రారంభించినట్లు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. నడకదారిలో వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. శిక్షణ పొందిన సిబ్బందిచే తక్షణ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవల కాంగ్రెస్ MP వంశీకృష్ణ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ <
News December 28, 2025
పాపులెవరు? ఎలాంటి వారికి నరకంలో శిక్ష పడుతుంది?

వేదశాస్త్రాలను నిందించేవారు, గోహత్య, బ్రహ్మహత్య చేసేవారు కఠిన శిక్షార్హులు. పరస్త్రీలను ఆశించేవారు, తల్లిదండ్రులను, గురువులను హింసించేవారు, దొంగతనాలు చేసేవారిని పాపాత్ములుగా పరిగణిస్తారు. శిశుహత్య, శరణు కోరిన వారిని బాధించడం, పెళ్లిళ్లు వంటి శుభకార్యాలను అపడం వల్ల కూడా నరకానికి పోతారట. ఈ దుశ్చర్యలు చేసే వారిని మరణానంతరం యమలోకానికి తీసుకెళ్లి, యముడి ఆజ్ఞ మేరకు నరకంలో కఠినంగా శిక్షిస్తారని నమ్మకం.


