News August 25, 2025

జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా మహమ్మద్ ముజాహిద్

image

ఖమ్మం జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా సోమవారం మహమ్మద్ ముజాహిద్ భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఈ సందర్భంగా మైనార్టీ సంక్షేమ అధికారికి జిల్లా కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 26, 2025

రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు ఆగస్టు 30 వరకు గడువు

image

ఖమ్మం జలజ టౌన్‌షిప్‌లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఆసక్తిగల ఉద్యోగులు ఆగస్టు 30లోపు రూ. 2 లక్షలు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 8 టవర్లలోని 576 ఫ్లాట్లు ఉన్నాయి. చదరపు గజానికి రూ.1,150 ధరగా నిర్ణయించారు. లాటరీని సెప్టెంబర్ 8న నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

News August 25, 2025

కేంద్రంతో కోట్లాడి యూరియాను తీసుకొచ్చాం: మంత్రి తుమ్మల

image

యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై కోట్లాడి35 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తీసుకొచ్చామన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా జిల్లాలకు తరలించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగా యూరియా కొరత ఏర్పడిందన్నారు.

News August 25, 2025

ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలి: జిల్లా కలెక్టర్

image

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన ప్రతి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాధానం అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ సూచించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తమ పరిధిలో చేయగలిగిన పనిని వెంటనే పూర్తి చేయాలని, లేని పక్షంలో దానికి గల కారణాలను, నిబంధనలను వివరిస్తూ సమాధానం ఇవ్వాలని అధికారులను సూచించారు.