News August 17, 2025

జిల్లా యంత్రాంగం అప్రమత్తం కావాలి: మంత్రి అచ్చెన్న

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం కావాలని ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని అచ్చెన్నాయుడు అధికారులను సూచించారు. ఈ మేరకు నిమ్మాడలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని నాగావళి, వంశధార, మహేంద్రతనయ వంటి నదుల తీరంలో ఉన్న గ్రామ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

Similar News

News August 18, 2025

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్ సైట్‌ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News August 18, 2025

SKLM: ‘తుఫాన్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు’

image

శ్రీకాకుళం జిల్లాలోని ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో తుఫాన్ అలర్ట్ కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 19 వరకు అధికారులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయబడవని తెలియజేశారు. నిత్యావసర వస్తువులు నిల్వలు ఉంచాలని సూచించారు.

News August 17, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤టెక్కలి: జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు
➤SKLM: తుఫాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు
➤ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: అచ్చెన్న
➤ జిల్లా వ్యాప్తంగా వర్షాలు..పలుచోట్ల వరి పంట ముంపు
➤పాతపట్నం: మూడు నెలలుగా తాగునీటికి ఇబ్బందులు
➤ నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు
➤హిరమండలం: గొట్టా బ్యారేజ్‌కు భారీగా చేరుతున్న నీరు
➤ టెక్కలి: డీజిల్ ట్యాంకర్ బోల్తా..తప్పిన ప్రమాదం