News May 22, 2024
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం
కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులు, పి.హెచ్.సీల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ.. జిల్లాలో అమలయ్యే వైద్య ఆరోగ్య శాఖల కార్యక్రమాలు ప్రతివారం సమీక్షిస్తామని అన్నారు.
Similar News
News November 29, 2024
‘ఫెంగల్’ తుఫానుపై APSDMA ఏం చెప్పిందంటే..
కృష్ణా: ఫెంగల్’ తుఫాను శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరికి 270కి.మీ, చెన్నైకి 300 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ మేరకు APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తా ప్రాంతాలైన బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలపై ఉంటుందన్నారు. మత్స్యకారులు ఈ నెల 30 వరకు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దన్నారు.
News November 29, 2024
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో రేపు 4,70,210 మందికి పింఛన్లు
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో మొత్తంగా రేపు 4,70,210 మంది ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు అందుకోనున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో 2,31,961 మందికి రూ.97,939,00,00, కృష్ణా జిల్లాలో 2,38,249 మందికి రూ.1,01,09,08,500 డిసెంబర్ నెల పింఛన్ల కింద రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ మేరకు లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ నగదును పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
News November 29, 2024
కృష్ణా: రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో సెప్టెంబర్ 2024లో నిర్వహించిన బీ-ఫార్మసీ 2వ సెమిస్టర్ పరీక్షల(2023- 24 విద్యా సంవత్సరం) రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు డిసెంబర్ 4లోపు ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుందని వర్సిటీ తెలిపింది. ఫీజు చెల్లింపు వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.