News December 19, 2025
జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాల అవగాహన సదస్సు

SP ధీరజ్ ఆదేశాల మేరకు విద్యార్థినుల భద్రతే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా శక్తి బృందాలు అవగాహన సదస్సులు నిర్వహించాయి. పాఠశాలలు, కళాశాలల్లో పోక్సో చట్టం, గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, బాల్య వివాహాల నివారణపై విద్యార్థులకు వివరించారు. లైంగిక వేధింపులు ఎదురైతే భయపడకుండా ఫిర్యాదు చేయాలన్నారు. అత్యవసర సమయంలో డయల్ 112, శక్తి యాప్ వినియోగంపై ప్రాక్టికల్ అవగాహన కల్పించారు.
Similar News
News December 25, 2025
రోజుకు 4 లక్షల లడ్డూలు తయారీ: TTD ఛైర్మన్

వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లు సంతృప్తికరంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. లడ్డూ విక్రయశాల, తయారీ విభాగాన్ని పరిశీలించిన ఆయన రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, 8 వేల కళ్యాణోత్సవం లడ్డూలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లడ్డూ విక్రయాలు పెరిగే అవకాశం ఉందని, నాణ్యతతో పాటు క్యూలైన్‌లో వేచిచూడే సమయం తగ్గించే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
News December 25, 2025
వంటింటి చిట్కాలు

* ఖీర్, పాయసం లాంటివి చేసేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచి పెరుగుతుంది.
* గ్రేవీ రుచి పెరగాలంటే మసాలా దినుసులను వేయించేప్పుడు అర చెంచా చక్కెర జత చేసి చూడండి. చక్కటి రంగుతోపాటు రుచి రెండింతలవుతుంది.
* పకోడీలు కరకరలాడకపోతే బజ్జీల పిండిలో ఒకట్రెండు చెంచాల బియ్యప్పిండి కలిపి చూడండి.
* సెనగలను ఉడికించిన నీటిని పారబోయకుండా చపాతీ పిండి తడపడానికి వాడితే పోషకాలు అందుతాయి.
News December 25, 2025
గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.


