News April 4, 2025
జిల్లా వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ: భద్రాద్రి కలెక్టర్

రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో శుక్రవారం జిల్లా జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా చౌక ధరల దుకాణాలకు సన్న బియ్యం తరలించామని తెలిపారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా తగు జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.
Similar News
News January 2, 2026
KMR: ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి

తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి శివారులో గురువారం రాత్రి ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందారు. దేవాయిపల్లికి చెందిన రాజయ్య వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. KMR నుంచి స్వగ్రామానికి బైక్‌పై వెళ్తుండగా నిజాంసాగర్ నుంచి కామారెడ్డి వెళ్తున్న RTC బస్సు కృష్ణాజీవాడి శివారులో మూల మలుపు వద్ద ఢీకొట్టింది. దీంతో రాజయ్య అక్కడిక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 2, 2026
HYD: భార్యాభర్తలు.. మీకు ఇలాగే జరుగుతోందా?

అనుమానం ఆలుమగల మధ్య చిచ్చుపెడుతోంది. భార్య ఫోన్ చూసినా, భర్త ఇంటికి లేట్ వస్తే ఇంట్లో గొడవ జరుగుతోందని ‘గ్రేటర్ సిటీస్ ఆఫ్ కపుల్స్’ తెలిపింది. పని ఒత్తిడి, SMలో ఒక్కవీడియో చూస్తే, ఆల్గారిథం అలాంటివే చూపిస్తే వాస్తవం అనుకుంటున్నారు. ఓల్డ్ మెమొరీస్, పాస్‌వర్డ్ దాచడం వంటి చిన్నవాటితో అనుమానాలకు తావిస్తున్నారని HYD, ముంబైలో చేసిన సర్వే వెల్లడించింది. ఈ ఏడాదిలోనైనా అన్యోన్యంగా ఉండాలని పిలుపునిచ్చింది.
News January 2, 2026
భారీగా పెరిగిన కూరగాయల ధరలు

కొత్త సంవత్సరం సామాన్యుడికి ధరల షాక్‌తో ప్రారంభమైంది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. తీవ్రమైన చలి వల్ల కూరగాయల దిగుబడి తగ్గి టమాటా, బీర, బెండ కిలో రూ.80-100కు చేరాయి. పచ్చిమిర్చి సెంచరీ దాటగా, మునగకాయ ధర కిలో రూ.400 పలుకుతోంది. చికెన్ కిలో రూ.300, కోడిగుడ్డు ఒక్కోటి రూ.8కు చేరింది. సంక్రాంతి పండుగ వస్తుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.


