News March 26, 2024
జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ హరిచందన తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లతో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 5 లక్షల 50వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్ కు రావచ్చని అంచనా వేసినట్లు తెలిపారు.
Similar News
News January 9, 2025
చౌటుప్పల్: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్
చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న భార్యభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు దంపతులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 9, 2025
డిండి: ఆకతాయిలతో కోర్టు ఆవరణం శుభ్రం చేయించారు
కందుకూరులో ఇటీవల మద్యం సేవించి ఓ వ్యక్తిపై అకారణంగా దాడికి ప్రయత్నించి అలజడి సృష్టించిన కోక అభిషేక్, జోసెఫ్, శివాజీపై కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టు ఎదుట బుధవారం ప్రవేశపెట్టారు. ముగ్గురు ఆకతాయిలు ఒక్కరోజు శిక్షలో భాగంగా కమ్యూనిటీ సర్వీస్ కింద కోర్టు ఆవరణం శుభ్రం చేయాల్సిందిగా స్పెషల్ మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ పొట్ట చెన్నయ్య ఆదేశించారని ఎస్సై రాజు అన్నారు. వారితో శిక్షను అమలు చేశామన్నారు.
News January 9, 2025
జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక బృందాలు: ఎస్పీ
నల్గొండ జిల్లాలో దొంగతనాల నివారణకు ప్రత్యేక పోలీస్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. బుధవారం అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనుమానిత వ్యక్తులు కాలనీల్లో తిరిగినట్లు కనిపిస్తే సమీపంలోని స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.