News July 8, 2025

జిల్లా వ్యాప్తంగా 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలు: కలెక్టర్

image

ఉపాధి హామీ పథకం కింద విజయనగరం జిల్లాలో 500 ఎకరాల్లో ఉద్యాన మొక్కలను నాటనున్నట్లు కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. ఉద్యాన శాఖ అధికారులతో కలెక్టర్ తన ఛాంబర్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. 8 నియోజకవర్గాల్లో ఉన్న 27 మండలాల్లో సుమారుగా 477 మంది రైతులకు మామిడి, జీడిమామిడి, కొబ్బరి, సపోటా, జామ మొదలగు 23 రకాల పండ్ల తోటలు మొక్కలు వేయుటకు సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News July 7, 2025

బాధితుల సమస్యలు చట్ట పరిధిలో పరిష్కరించాలి: VZM SP

image

బాధితుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని SP వకుల్ జిందాల్ అన్నారు. SP కార్యాలయంలో ఆయన సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి 40 ఫిర్యాదులు స్వీకరించారు. వీటిలో భూ తగాదాలకు చెందినవి 13, కుటుంబ కలహాలు 4, మోసాలకు పాల్పడినవి 5, ఇతర అంశాలకు సంబంధించి 18 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ఫిర్యాదులపై విచారణ చేపట్టి 7 రోజుల్లో పరిష్కారానికి కృషి చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

News July 7, 2025

VZM: కలెక్టరేట్‌కు 194 వినతులు

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన PGRSకు ప్రజల నుంచి 194 వినతులు అందాయి. రెవెన్యూ శాఖకు అత్యధికంగా 97 వినతులు అందగా పంచాయతీ శాఖకు 7, పింఛన్లు మంజూరు చేయాలని, తదితర అంశాలపై డీఆర్డిఏకు 31 వినతులు వచ్చాయి. మున్సిపాలిటీకి 5 , విద్యాశాఖకు 13, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి ఉన్నాయి. వినతులు పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు.

News July 7, 2025

VZM: భవానీని అభినందించిన వైఎస్ జగన్

image

విజయనగరం జిల్లా కొండకరకాం గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టర్ రెడ్డి భవానీకి మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కజకిస్థాన్‌లో ఇటీవల జరిగిన ఏషియన్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో భవానీ మూడు బంగారు పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.