News November 4, 2024

జిల్లా సమావేశంలో పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే

image

శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లా కేంద్రంలోని ఆరామ్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్‌కి జిల్లా టీడీపీ అంజినప్ప పుష్పగుచ్చాన్ని అందజేశారు.

Similar News

News February 5, 2026

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ పూర్తి చేయాలి: అనంత వెంకటరామిరెడ్డి

image

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమన్నారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

News February 5, 2026

పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయ దంపతుల విరాళం

image

అనంతపురం జిల్లా సెట్టూరు మండలం మాకోడికి గ్రామ పాఠశాల అభివృద్ధి కోసం ఉపాధ్యాయ దంపతులు తిప్పే స్వామి, రామాంజనమ్మ తమ ఉదారత చాటుకున్నారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పిలుపుతో స్పందించిన వీరు, పాఠశాలకు తమ నెల జీతం రూ.59,930 విరాళంగా ప్రకటించారు. తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులోనూ పాఠశాల ప్రగతికి తోడ్పాటు అందిస్తామని వారు స్పష్టం చేశారు.