News October 25, 2025
జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఉచిత OP సేవలు: MP

ప్రజల ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ జిల్లా సర్వజనాసుపత్రిలో వైద్యసేవల్ని మరింత విస్త్రృతం చేస్తున్నామని ఏలూరు MP పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. శనివారం జిల్లా సర్వజనాసుపత్రిలో విజయవాడకు చెందిన ఓ న్యూరో & కార్డియాక్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత OP వైద్యసేవలను ఆయన ప్రారంభించారు. ఇకపై ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉచిత OP సేవలు అందుబాటులో ఉంటాయన్నారు.
Similar News
News October 25, 2025
WWC: భారత్ సెమీస్‌లో తలపడేది ఈ జట్టుతోనే

AUSతో మ్యాచ్‌లో SA ఘోర ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన SA 97 రన్స్‌కే ఆలౌట్ కాగా AUS 16.5 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. 13 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను ఖాయం చేసుకుంది. భారత్ రేపు బంగ్లాతో జరిగే చివరి మ్యాచ్‌లో గెలిచినా నాలుగో ప్లేస్‌లోనే ఉంటుంది. దీంతో ఈనెల 30న రెండో సెమీఫైనల్లో పటిష్ఠ AUSతో IND తలపడనుంది. ఈ గండం గట్టెక్కితేనే తొలి WCకు భారత్ చేరువవుతుంది. తొలి సెమీస్‌లో SA, ENG తలపడతాయి.
News October 25, 2025
ప్రజల భద్రత కోసం పటిష్ఠ చర్యలు: అనకాపల్లి ఎస్పీ

తుఫాను హెచ్చరిక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అనకాపల్లి జిల్లా పోలీసులు అన్ని అవసరమైన చర్యలను చేపట్టారని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. శనివారం ఆయన తన కార్యాలయం నుంచి మాట్లాడారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. స్థానిక అధికారుల సూచనలు ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.
News October 25, 2025
సిరిసిల్ల: దివ్యాంగుల పెట్రోల్ బంక్ అభినందనీయం: ఇన్‌ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల కలెక్టరేట్: దివ్యాంగుల పెట్రోల్ బంక్ ఏర్పాటు అభినందనీయమని సిరిసిల్ల ఇన్‌ఛార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. శనివారం ఆమెను కలిసిన పెట్రోల్ బంక్ నడుపుతున్న దివ్యాంగులు, జిల్లా యంత్రాంగం సహకారంతో తమకు ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ పెట్రోల్ బంక్ నిర్వహణ వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు.


