News January 24, 2026
జిల్లా స్థాయి షార్ట్ ఫిలిం పోటీల్లో NGKL జిల్లావాసికి ప్రథమ బహుమతి

వనపర్తి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ (DLSA) నిర్వహించిన జిల్లా స్థాయి లఘు చిత్రాల పోటీల్లో లింగాల మండలం సురాపూర్ గ్రామానికి చెందిన అతినారపు సాయి సాగర్ మొదటి బహుమతి సాధించాడు. సామాజిక అవగాహన కోసం ఆయన రూపొందించిన చిత్రం న్యాయ నిర్ణేతల ప్రశంసలు పొందింది. బాధ్యతాయుతమైన చిత్రాలను రూపొందించినందుకు సాయి సాగర్‌ను గ్రామస్థులు అభినందించారు.
Similar News
News March 4, 2026
జనసేన ఆఫీసుపై దాడి.. శ్రీకాకుళం జిల్లా యువకుడి అరెస్ట్

మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇటీవల 2 కార్లను ధ్వంసం చేయడంతో పాటు భద్రతా సిబ్బందిపై దాడిచేసిన వ్యక్తిని మంగళవారం రిమాండ్‌కి పంపినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. పార్టీ కార్యాలయ భద్రతా సిబ్బంది RI పెంటారావు ఫిర్యాదు మేరకు కంచిలి మండలం బెలగాంకు చెందిన నీలాద్రిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు.
News March 4, 2026
తూ.గో: ఇన్‌స్టాగ్రామ్ పరిచయం.. నమ్మించి గర్భవతిని చేశాడు..!

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, శారీరకంగా దగ్గరై గర్భవతిని చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగిని రాయవరం పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకోమని కోరగా నిందితుడు నిరాకరించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI సురేశ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
News March 4, 2026
నెల్లూరు: డ్రగ్స్ వద్దు బ్రో అంటూ..!

నెల్లూరు జిల్లాను “డ్రగ్ ఫ్రీ” జిల్లాగా మార్చే లక్ష్యంతో ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 988 ఈగల్ క్లబ్స్, 24 డ్రోన్లతో నిఘా పెంచారు. “డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నారు.


