News October 5, 2025
జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలకు ఎస్పీ సూచనలు

అనంతపురం జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది, ప్రొబేషనరీ ఎస్ఐలతో SP జగదీశ్ సమావేశం నిర్వహించారు. పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సభలో విధుల్లో ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం అందించాలన్నారు. పారదర్శకత, నిజాయితీ, నిష్పక్షపాతంతో ప్రజలకు సేవ చేయాలని అన్నారు.
Similar News
News October 6, 2025
నేడు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. జిల్లా ప్రజలు తమ సమస్యలను అర్జీల ద్వారా అందజేయాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
News October 5, 2025
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెద్దవడుగూరు విద్యార్థుల ఎంపిక

అనంతపురంలో శనివారం నిర్వహించిన SGF జిల్లాస్థాయి క్రీడా పోటీలలో ప్రతిభ కనపరిచిన పెద్దవడుగూరు విద్యార్థులు పలువురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వారిలో పల్లవి, భువన చంద్రిక, చిన్న ఓబుల రెడ్డి, జ్ఞానేశ్వర్ (వెయిట్ లిఫ్టింగ్) ఉన్నారని ఉపాధ్యాయుడు మారుతి తెలిపారు. రాష్ట్రస్థాయికి తమ పిల్లలు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News October 4, 2025
కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి: కలెక్టర్

మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అనంతపురం కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్‌లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.