News March 19, 2025
జి. కొండూరు: వరుసకు కూతురితో అసభ్య ప్రవర్తన

కూతురు వరుసయ్యే బాలికతో వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జి. కొండూరు(M) చెవుటూరులో జరిగింది. విజయవాడకు చెందిన మహిళ భర్తతో విడిపోయింది. కొడుకు, కమార్తెతో వచ్చి రవీంద్రతో ఉంటోంది. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ వ్యక్తి బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లి పని నుంచి ఇంటికి రాగానే చిన్నారి జరిగిందంతా చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేయగా.. అవమానంతో వ్యక్తి విషం తాగాడు.
Similar News
News July 6, 2025
పాలకుర్తిలో నేడే శూర్పణఖ వేషధారణ

పాలకుర్తి మండల కేంద్రంలో మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని గౌడ కులస్థులు ఆదివారం నిర్వహించబోయే శూర్పణఖ వేషధారణ విశేషంగా ఆకట్టుకోబోతోంది. బండి కొండయ్య గౌడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. డప్పు చప్పుళ్లతో, యువతీ యువకుల కేరింతలతో ఊరంతా దద్దరిల్లేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. శూర్పణఖను దర్శించుకుని స్పర్శిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇది ఆనవాయితీగా వస్తోంది.
News July 6, 2025
SRCL: వేములవాడలో విషాదం.. యువకుడి ఆత్మహత్య

వేములవాడ పట్టణంలోని మటన్ మార్కెట్ ఏరియాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ప్రకారం.. దీటి వేణుగోపాల్- రాణి దంపతుల మొదటి కుమారుడు రోహిత్ (24) శనివారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, మృతుడు కొంతకాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీటెక్ చదువుతున్నట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
News July 6, 2025
రేపటి నుంచి పెరగనున్న భక్తుల రద్దీ

నెల్లూరులోని బారాషహిద్ దర్గా వద్ద నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం కానుంది. అన్ని గ్రామాల్లో జరుగుతున్న మొహర్రం వేడుకలు ఆదివారంతో ముగుస్తాయి. దీంతో నేడు బారాషహిద్ దర్గా వద్ద భక్తుల రద్దీ తక్కువగా ఉండే అవకాశం ఉంది. సోమవారం నుంచి భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే దర్గా వద్ద పోలీస్ అధికారులు 1700 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.