News February 18, 2025
జి.సిగడాం: పింఛను సొమ్ముతో అధికారి జంప్

జి.సిగడాంలోని పెంట గ్రామ సచివాలయంలో సర్వేయర్ పింఛను సొమ్ముతో పరారైనట్లు సచివాలయ సిబ్బంది ఆరోపించారు. ఈ మేరకు వారు సర్వేయర్ భాను ప్రతాప్ రూ. 49 వేలు తీసుకెళ్లాడని సోమవారం తహశీల్దార్ ఎం. శ్రీకాంత్, ఎంపీడీవో రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈనెలకు సంబంధించి రూ. 1.66 లక్షల సొమ్ములో రూ. 1.17 లక్షలు పంపిణీ చేసి మిగిలిన సొమ్ముతో ఉడాయించినట్లు వారు ఆరోపించారు.
Similar News
News March 13, 2025
SKLM: ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు జరగాలి

మార్చి 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏపీ CS కె.విజయానంద్ కలెక్టర్‌ను ఆదేశించారు. బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్చువల్‌గా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరయ్యారు. 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలన్నారు.
News March 12, 2025
శ్రీకాకుళం: ఏసీబీకి చిక్కిన బీసీ వెల్ఫేర్ సీనియర్ అసిస్టెంట్

శ్రీకాకుళం జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన Sr.అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కారు. ఇంక్రిమెంట్ల, ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ చేసే విషయంలో అదే శాఖకు చెందిన వివిధ B.C హాస్టల్‌లో పనిచేస్తే అటెండర్, కుక్‌ల నుంచి రూ.25,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.
News March 12, 2025
శ్రీకాకుళంలో ఇంటర్ పరీక్షలకు 427 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. బుధవారం ఇంటర్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వివరాలను RIO దుర్గారావు ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 19,093 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 18,666 మంది హాజరైనట్లు వెల్లడించారు. 427 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మాల్ ప్రాక్టీస్ ఒక దగ్గర జరిగిందని స్పష్టం చేశారు.