News September 26, 2025

జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

మచిలీపట్నంలో శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ డీకే బాలాజీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణం నుంచి గ్రామ స్థాయి వరకు ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పన్ను తగ్గింపులు, వ్యాపారులకు కలిగే లాభాలు ఇంటింటికి చేరేలా చూడాలని ఆదేశించారు. మచిలీపట్నంలో షాపింగ్ ఫెస్టివల్ నిర్వహణకు రూపకల్పన చేయాలని సూచించారు.

Similar News

News September 27, 2025

కృష్ణాజిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. ఫేక్ జర్నలిస్టుల మోసాలకు చెక్

image

జర్నలిజం ముసుగులో సంఘ విద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఆటకట్టించేందుకు కృష్ణాజిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం వారిచే జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్లు కలిగి ఉన్న జర్నలిస్టులకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఇవ్వనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఫేక్ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడే వారి ఆటకట్టించేందుకు QRతో కూడిన ప్రెస్ స్టిక్కర్లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

News September 27, 2025

మచిలీపట్నం: ‘సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి’

image

జిల్లాలో నెలకొన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ మీటింగ్ హాలులో అధికారులతో సమావేశమై కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో CM చర్చించిన అంశాలపై సమీక్షించారు. ప్రతి శాఖకు సంబంధించిన పనుల్లో పురోగతి సాధించాలన్నారు. అదేవిధంగా తన దృష్టికి వచ్చిన పలు సమస్యలపై స్పందించి పరిష్కరించాలన్నారు.

News September 26, 2025

ఉయ్యూరు: చెరుకు ధర ప్రకటన

image

కేసీపీ షుగర్స్ 2025-26 క్రషింగ్ సీజన్‌కు చెరకు ధర ప్రకటించింది. టన్నుకు రూ.400 సబ్సిడీతో కలిపి, చెరకు ధరను రూ.3,690గా నిర్ణయించినట్లు యూనిట్ హెడ్ యలమంచిలి సీతారామదాస్ తెలిపారు. యాంత్రీకరణకు అనువుగా సాగుచేసే రైతులకు టన్నుకు అదనంగా రూ.100 ఇస్తామన్నారు. ఈ సీజన్‌లో నాటే చెరకు మొక్క తోటలకు ఎకరాకు రూ.10 వేలు సబ్సిడీ, రూ.20 వేలు వడ్డీ లేని రుణం అందిస్తామని ప్రకటించారు.