News October 11, 2025

జీఎస్టీ 2.0: పాత ధరలకు అమ్మితే చర్యలు: కలెక్టర్

image

జీఎస్టీ 2.0 ప్రయోజనాలు ప్రజలకు చేరాలని, పాత జీఎస్టీ ధరలకు విక్రయించే వర్తకులపై తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల కోసం జిల్లా స్థాయిలో 8712631283 నంబర్‌తో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 8712631279 నంబర్ అందుబాటులో ఉందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.

Similar News

News October 11, 2025

AIకి అధిక విద్యుత్ ఎందుకు అవసరం?

image

AI, డీప్ లెర్నింగ్ మోడల్స్ చేసే కాలిక్యులేషన్స్‌కు GPU, TPUల వంటి హై-పవర్ హార్డ్‌వేర్‌ అవసరం అవుతుంది. ఆ హార్డ్‌వేర్‌, వాటి నుంచి వచ్చే వేడిని తగ్గించడానికి కూలింగ్ వ్యవస్థలూ <<17977805>>హైపవర్‌<<>>ను డిమాండ్ చేస్తాయి. పెద్ద AI మోడల్స్ శిక్షణకు వేల గంటల పాటు హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అవసరం అవుతుంది. అలాగే డేటా సెంటర్లలోని సర్వర్లు, నెట్‌వర్కింగ్ సామగ్రికీ.. 24/7 AI సేవలకు అధిక విద్యుత్ కావాల్సి ఉంటుంది.

News October 11, 2025

జూబ్లీహిల్స్ ఎన్నిక ఎఫెక్ట్: తాత్కాలికంగా ప్రజావాణి రద్దు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఒక ప్రకటనలో తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల13న విడుదల కానున్నదని, నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు ఉన్నందున ఫలితాల తదుపరి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని, జిల్లా ప్రజలు గమనించవలసిందిగా కోరారు.

News October 11, 2025

పేరులో చిన్న మార్పు… కుప్పకూలిన కంపెనీ

image

పేరులో చిన్న మార్పు ఓ కంపెనీ పతనానికి దారితీసింది. ఢిల్లీకి చెందిన ‘B9 బెవరేజెస్ Pvt Ltd’కి చెందిన Bira91 బీర్లకు పదేళ్లుగా ఎంతో డిమాండ్ ఉండేది. 2024లో IPO కోసం Pvt అనే పదాన్నితొలగించింది. కొత్త పేరుతో వచ్చిన బీర్లు పాత కంపెనీవే అని నమ్మక రాష్ట్రాల్లో నిషేధించారు. ఉత్పత్తీ నిలిచిపోయింది. ₹748 కోట్ల నష్టంతో సిబ్బందికి జీతాలూ చెల్లించలేకపోయింది. కంపెనీ CEO జైన్‌ను తొలగించాలని వారు పిటిషన్ వేశారు.