News December 21, 2024

జీఎస్‌డీపీ వృద్ధిరేటు లక్ష్యంగా పనిచేయాలి: ప్రకాశం కలెక్టర్

image

జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగంగా 15% జీఎస్‌డీపీ వృద్ధిరేటు లక్ష్యంతో వ్యవసాయం అనుబంధ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆమె సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటు సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు.

Similar News

News December 22, 2024

ప్రకాశం: హాస్టల్లోనే ఫార్మసీ విద్యార్థిని ప్రసవం

image

గుంటూరు కలెక్టర్, ఎస్పీ ఆఫీస్‌కి కూత వేటు దూరంలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ వసతిగృహంలో 19 ఏళ్ల ఫార్మసీ విద్యార్థిని ఆడబిడ్డకు జన్మనివ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకు దర్శికి చెందిన విద్యార్థిని హాస్టల్లోనే ప్రసవించడంతో అధికారులు జీజీహెచ్‌కి తరలించారు. ఈఘటనపై కలెక్టర్ నాగలక్ష్మీ హెచ్ డబ్ల్యూఓ జయప్రదను సస్పెండ్ చేసి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. సమీప బంధువు గర్భానికి కారణమని సమాచారం.

News December 21, 2024

చీపురు పట్టిన జాయింట్ కలెక్టర్

image

మద్దిపాడు మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో శనివారం పరిశ్రమ శుభ్రత కార్యక్రమాన్ని ఎంపీడీవో జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆయన చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

News December 20, 2024

సింగరాయకొండ: పంట పొలాల్లోకి దూసుకెళ్లిన స్కూల్ బస్సు

image

సింగరాయకొండలో భాష్యం స్కూల్ బస్సు అదుపుతప్పి పంట కాలవలోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం జరిగింది. 13 మంది స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లుతుండగా అదుపు తప్పి పంట పొలాల్లోకి వెళ్ళినట్లు స్థానికులు తెలిపారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బ్రేక్ వేయడంతో పెను ప్రమాదం తప్పింది.