News October 27, 2025

జీకేవీధి: అంతర్రాష్ట్ర సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత

image

మొంథా తుఫాను నేపథ్యంలో విశాఖ నుంచి జీకేవీధి మండలం సీలేరు మీదుగా భద్రాచలం వెళ్లే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులను సోమవారం సాయంత్రం నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విశాఖ ఆర్టీసీ డిపో మేనేజర్ మాధురి తెలిపారు. తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈనెల 29వరకూ నిలిపివేస్తున్నామన్నారు.

Similar News

News October 27, 2025

సైబర్ మోసాలకు గురికావొద్దు: వరంగల్ పోలీస్

image

పోలీస్, సీబీఐ అధికారులుగా సైబర్ నేరగాళ్లు మోసం చేసి, ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నేరగాళ్లు తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని, తమ పిల్లలు క్రిమినల్ కేసుల్లో చిక్కుకున్నారని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇలాంటి కాల్స్‌కు భయపడకుండా, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్‌ను సంప్రదించాలని పోలీసు శాఖ అప్రమత్తం చేస్తోంది.

News October 27, 2025

విటమిన్ Cతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలు

image

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో విటమిన్ C ఒకటి. ముఖ్యంగా స్త్రీలకు ఇది ఎంతో ముఖ్యం అంటున్నారు నిపుణులు. విట‌మిన్ సి తగ్గితే స్త్రీల‌కు డ‌యాబెటిస్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. C విటమిన్‌తో కొల్లాజెన్ ఉత్ప‌త్తి పెరిగి వృద్ధాప్య ఛాయ‌లు తగ్గుతాయి. గ‌ర్భిణులు తీసుకుంటే శిశువులో లోపాలు రాకుండా ఉంటాయి. స్త్రీల‌లో ఈస్ట్రోజ‌న్ స్థాయిలు పెరుగుతాయి. దీని వ‌ల్ల హార్మోన్ స‌మ‌స్య‌లు, గ‌ర్భాశ‌య స‌మ‌స్య‌లు ఉండ‌వు.

News October 27, 2025

ఎవరికి ఎంత విటమిన్ C కావాలంటే?

image

మహిళలు విట‌మిన్ C ఉండే ఆహారాల‌ను రోజూ తినాల్సి ఉంటుంది. మహిళలకు రోజుకు 75 మిల్లీగ్రాముల మోతాదులో విట‌మిన్ C అవ‌సరం అవుతుంది. గర్భిణులకు 85 mg, బాలింతలకు 120 mg అవసరమని నిపుణులు చెబుతున్నారు. ట‌మాటా, కివీ, క్యాబేజీ, నారింజ‌, నిమ్మ‌, ఉసిరి, క్యాప్సికం, అర‌టి పండ్లు, బెర్రీలు, పైనాపిల్‌, జామ, బొప్పాయి, ద్రాక్ష‌, దానిమ్మ‌, ప‌చ్చి బ‌టానీలు, మ్యాంగో ద్వారా విట‌మిన్ Cని పొందొచ్చని సూచిస్తున్నారు.