News October 22, 2025

జీకే వీధి: డోలి మోతలోనే యువతి మృతి

image

జీకే వీధి (M) నేలపాడులో సుమిత్ర (22) మంగళవారం కాఫీ తోటకు వెళుతూ మార్గ మధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన గ్రామస్థులు ఆమెను డోలి కట్టి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంటే తమ బిడ్డ బతికేదని, డోలిలో తీసుకెళ్లడం వల్ల వైద్యం సకాలంలో అందక మృతి చెందిందని కుటుంబీకులు వాపోయారు.

Similar News

News October 22, 2025

కామవరపుకోట: పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య యత్నం

image

చిట్టీలు వసూల కాక ఆర్థికంగా ఇబ్బందులు పడిన ఓ మహిళ శరీరంపై పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కామవరపుకోట మండలం వీరిశెట్టి గూడెంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన రాజేశ్వరి వేసిన చిట్టీలు వసూలు కాక ఈ ఘాతుకానికి సిద్ధమైంది. కుటుంబీకులు ఆమెను ఓ ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై తడికలపూడి ఎస్సై చిన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 22, 2025

జనగామ జిల్లాకు 16,628 అభ్యాస దీపికలు

image

పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా జిల్లా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వెనుకబడిన విద్యార్థులకు పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యేలా, ఉత్తీర్ణత సాధించేలా అనుభవజ్ఞులైన విషయ నిపుణులచే అభ్యాస దీపికలను రూపొందించారు. జనగామ జిల్లాలోని కేజీబీవీ, జడ్పీ, మోడల్, ఎయిడెడ్ పాఠశాలలకు చెందిన 3,600 మంది విద్యార్థులకు 16,628 పుస్తకాలను ముద్రించి అందజేశారు.

News October 22, 2025

WNP: ఆరోగ్యశాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

image

జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో నవంబర్ 15వ తేదీ వరకు ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభాకార్డుల జనరేషన్ ప్రక్రియను ఇంకా వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. అలాగే డెంగీ పరీక్షలను కొనసాగించాలని సూచించారు. ANMలతో ఎన్ సి డి స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేయించాలన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు.