News March 25, 2025
జీడీపీలో ఉమ్మడి పాలమూరు జిల్లా వెనుకబాటు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వనరుల ఉత్పత్తులు వినియోగంలో ఉమ్మడి పాలమూరు జిల్లాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఆయా జిల్లాల క్యాపిటల్ ఇన్కమ్, జీడీపీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ రెండు అంశాల్లోనూ ఉమ్మడి జిల్లాగా ఉన్న పాలమూరు పరిస్థితి మాత్రం కొంత మెరుగ్గా ఉండగా, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల పరిస్థితి అధ్వానంగా ఉంది.
Similar News
News March 28, 2025
అమెరికాలో జనసేన ఆత్మీయ సమావేశం

అమెరికాలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు ఆధ్వర్యంలో శుక్రవారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ పాల్గొన్నారు. జనసేన పార్టీ దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీగా 100% స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించిందన్నారు. వివిధ రంగాల్లో ఉన్న మేధావులు పార్టీ కోసం కృషి చేశారని కొనియాడారు. ఎన్డీఏ కూటమి బలోపేతానికి ఎన్ఆర్ఐలు సహకారం అందించాలని కోరారు.
News March 28, 2025
ఎటపాక : రోడ్డుపై శవాన్ని వదిలి పరుగులు

తేనెటీగలు దాడి చేయడంతో శవాన్ని రోడ్డు మీదే వదిలేసి పరారైన ఘటన ఎటపాకలోని గౌరీదేవి పేట గ్రామంలో శుక్రవారం జరిగింది. గౌరీదేవిపేట గ్రామంలో చనిపోయిన మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకొస్తుండగా.. దారి మధ్యలో తేనెటీగల గుంపు దాడి చేసింది. దీంతో నడిరోడ్డు మీద శవాన్ని వదిలేసి ప్రజలంతా తలోదిక్కుకి పరుగులు పెట్టారు.
News March 28, 2025
చరిత్ర సృష్టించిన నొవాక్ జకోవిచ్

దిగ్గజ టెన్నిస్ క్రీడాకారుడు నొవాక్ జకోవిచ్ మియామీ ఓపెన్‌లో చరిత్ర సృష్టించారు. అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డాపై 6-3, 7-6 (7/4) తేడాతో గెలుపొందారు. ఈక్రమంలో టోర్నీ చరిత్రలో సెమీస్‌కు చేరిన అతి పెద్ద వయస్కుడిగా రికార్డులకెక్కారు. ఈరోజు జరిగే సెమీస్‌లో బల్గేరియాకు చెందిన గ్రిగోర్ దిమిత్రోవ్‌తో ఆయన తలపడనున్నారు.