News January 3, 2026

జీర్ణశక్తిని పెంచే ఫ్రూట్స్ ఇవే..

image

శీతాకాలంలో జీర్ణశక్తి మందగిస్తుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఫైబర్, ఎంజైమ్స్ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి. నారింజ, కివి, దానిమ్మ, బొప్పాయి, జామపండు శీతాకాలంలో ఎక్కువగా తినాలి. ఇవి మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంతో పాటు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అలాగే గ్రేప్‌ ఫ్రూట్‌, బెర్రీలు, బెర్రీలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శీతాకాలంలో బరువు పెరగకుండా నిరోధిస్తాయంటున్నారు నిపుణులు.

Similar News

News February 21, 2026

మహిళలకు ఫ్రీ బస్‌.. రూ.50 చెల్లిస్తేనే!

image

TG: RTCలో ఉచిత ప్రయాణం కోసం మహిళలకు ‘మహాలక్ష్మి’ స్మార్ట్ కార్డులు త్వరలో జారీ కానున్నాయి. దీనికి పౌరసరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకొని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులున్న 5L మందికి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. కార్డులు లేని వారు ఆధార్‌తో ఫ్రీ జర్నీ చేయవచ్చు. బస్‌పాస్/మీ-సేవా సెంటర్లలో ₹50 చెల్లించి కార్డు తీసుకోవాలని తెలుస్తోంది.

News February 21, 2026

లొంగు‘బాట’లో దేవ్‌జీ?

image

మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్ దేవ్‌‌జీ లొంగుబాటుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన టార్గెట్‌గా కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో భారీ <<19182443>>కూంబింగ్<<>> చేపట్టిన విషయం తెలిసిందే. అడవిని జల్లెడ పడుతూ ముందుకు సాగుతున్నాయి. దీంతో సురక్షిత లొంగుబాటు కోసం ఆయన తెలంగాణను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి కూడా దేవ్‌జీ బాటలోనే సరెండర్ కావాలని చూస్తున్నట్లు సమాచారం.

News February 21, 2026

ఇంటర్వ్యూతో ANGRAUలో ఉద్యోగాలు

image

ఏపీలోని ఆచార్య NG రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ 3 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి పీజీ(ఫామ్ మెషినరీ, ప్రాసెసింగ్ అండ్ ఫుడ్ ఇంజినీరింగ్), BTech, MSc, PhD అర్హతతో పాటు పని అనుభవం గలవారు ఇవాళ ఉదయం 10.30గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. టీచింగ్ అసోసియేట్‌కు నెలకు రూ.61,000+HRA, పార్ట్ టైమ్ టీచర్‌కు రూ.27,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://angrau.ac.in/