News January 20, 2026
జీలుగుమిల్లి-పట్టిసీమ రహదారికి భూ సేకరణ పూర్తి చేయాలి: JC

జీలుగుమిల్లి-పట్టిసీమ రహదారి 2వ విడత భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ఏలూరు జేసీ అభిషేక్ గౌడ అధికారులను సోమవారం ఆదేశించారు. కలెక్టరేట్‌లోని అధికారులతో జేసీ సమీక్షించారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరుచేసిందన్నారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 84 కి.మీ.ల భూసేకరణ చేపట్టామన్నారు. జీలుగుమిల్లి- పట్టిసీమ రహదారి 2వ విడతలో 44 కి.మీ.ల భూసేకరణ చేపట్టాలన్నారు.
Similar News
News February 11, 2026
వరుస హత్యలతో సీతంపేటలో ఆందోళన!

MHBD(D) గార్ల మండలం సీతంపేట పరిధిలో గత రెండేళ్లుగా జరుగుతున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మహేష్ అనే యువకుడి హత్య, అంకన్నగూడెంలో కన్నబిడ్డలకే విషమిచ్చి దంపతుల ఆత్మహత్య, అత్తను అల్లుడే కరెంట్ షాక్‌తో చంపడం వంటి ఘటనలు కలకలం రేపాయి. మానవతా విలువలు మంటగలుస్తున్నాయని, ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులు, సామాజిక సంస్థలు అవగాహన సదస్సులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.
News February 11, 2026
గోళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే అధిక కొలెస్ట్రాల్

బాడీలో కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగినప్పుడు గోళ్లలో మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గులాబీ రంగులో ఉండే గోళ్లు రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడంతో రంగుమారి పాలిపోయినట్టు/తెల్లగా కనిపిస్తాయి. ఒనికోరెక్సిస్ అని పిలిచే గాట్లు ఏర్పడతాయి. రక్త ప్రవాహం తగ్గడంతో పెరుగుదలకు కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఒంకరగా పెరుగుతాయి. కొందరిలో నీలం/ఊదా రంగులో కనిపిస్తాయి.
News February 11, 2026
తెల్లకాకిని మీరెప్పుడైనా చూశారా?

ఆదోని మండలం సంతెక్కుడ్లూరు గ్రామంలో మంగళవారం అరుదైన తెల్లకాకి ప్రత్యక్షమైంది. మారెమ్మ అవ్వ దేవాలయం వద్ద కనిపించిన ఈ కాకిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. సాధారణంగా నల్లగా ఉండే కాకి ఇలా తెల్లగా ఉండటం వెనుక ఆల్బినిజం (Albinism) అనే జన్యుపరమైన మార్పు కారణమని నిపుణులు చెబుతున్నప్పటికీ, స్థానికులు మాత్రం దీనిని వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన ఫలితంగా భావిస్తూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.


