News March 14, 2025
జీలుగుమిల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుమలకుంట వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జీలుగుమిల్లి మండలం టి.గంగన్నగూడెంకు చెందిన కొర్సా సత్తిబాబు (35) మృతి చెందారు. ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Similar News
News March 15, 2025
ఇతర మతాలవారిని తిట్టగలరా?: పవన్ కళ్యాణ్

AP: తనను సనాతన ధర్మం రక్షకుడని ఓ ఆంగ్ల జర్నలిస్టు ఎద్దేవా చేశారంటూ Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ‘మా రాముడి విగ్రహం తల నరికేస్తే మా మనోభావాలు గాయపడకూడదా? నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు అల్లానో, జీసస్నో, మేరీమాతనో అవమానించి బతకగలరా? కానీ లక్ష్మీ దేవిని, సరస్వతి దేవిని అవమానిస్తారు. రథాల్ని తగులబెట్టేస్తారు. తప్పును తప్పని చెబితే మతోన్మాదమా?’ అని ప్రశ్నించారు.
News March 15, 2025
పవన్ ప్రసంగంపై అంబటి సెటైర్

AP: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంపై వైసీపీ నేత అంబటి రాంబాబు సెటైరికల్ ట్వీట్ చేశారు. ‘జయకేతనంలో ఏమి చెప్పాలనుకున్నాడో ఏమి చెప్పాడో పాపం పవన్ కళ్యాణ్’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
News March 15, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో.. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు @జగిత్యాలలో భార్య కాపురానికి రావడం లేదని బీరు సిసతో తలపై కొట్టుకున్న యువకుడు @మెట్పల్లిలో అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక పర్యటన @4వ రోజుకు చేరుకున్న MRPS నిరసన దీక్ష @దులూర్ లో పాముకాటుకు గురై గేదె మృతి @రామగుండంలో కారును ఢీ కొట్టిన లారీ @వెల్దుర్తి SRSP కెనాల్ లో పడి యువకుడి మృతి