News March 21, 2025
జీవనోపాధికి వెళ్లి కువైట్‌లో గుండెపోటుతో మృతి

జీవనోపాధికి కువైట్ వెళ్లిన సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన చింతా సాగర్ (34) ఈ నెల 18న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నెల 19న కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 2022లో కారు డ్రైవర్‌గా పని చేసేందుకు సాగర్ కువైట్ వెళ్లారు. రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చి మళ్లీ గత ఏడాది జులైలో కువైట్ వెళ్లి అక్కడ మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Similar News
News March 28, 2025
మెట్రో ఎండీ పదవి కాలం కొనగించే అవకాశం..!

నిన్న ప్రభుత్వం టెర్మినేట్ చేసిన వారిలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ఉన్నారు. 2016లో రిటైర్డ్ అయిన మెట్రో ఎండీ, ప్రస్తుతం మెట్రో ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో మరొకసారి ఎక్స్‌టెన్షన్ ఇచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాల్లో చర్చ సాగుతోంది.
News March 28, 2025
గద్వాల: జమ్మిచేడు జమ్ములమ్మకు ప్రత్యేక అలంకరణ

జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారిని అభిషేకించి, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం తదితర పూజాలు జరిపారు. పరిసర ప్రాంతాల, కర్ణాటక, రాయలసీమ ఇతర ప్రాంతాల భక్తులు, బంధువులతో పెద్దఎత్తున తరలివచ్చి కురువ డోళ్లు, బైనోల్ల పాటలతో దీపాల కాంతుల్లో అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
News March 28, 2025
భువనగిరి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. గడువు పొడిగింపు

ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, మైనార్టీ విద్యార్థులు పోస్టుమట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు గడువు ఈనెల 31 వరకు పొడిగించినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి వసంతకుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.