News April 9, 2025
జీవన్ రెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ విప్

పెగడపల్లి మండలం బతికేపెల్లిలో మాజీ MLC జీవన్ రెడ్డి మా కాలగిరి ముత్యం రెడ్డి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముత్యం రెడ్డి మృత దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం జీవన్ రెడ్డిని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.
Similar News
News December 18, 2025
ఈ నెల 21న జాతీయ లోక్ అదాలత్: ASF SP

ఈ నెల 21న జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా SP నితికా పంత్ తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్, సివిల్, ఎక్సెజ్, మోటారు వాహనాల కేసులను అధిక సంఖ్యలో రాజీ కుదుర్చుకొని క్లోజ్ చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.
News December 18, 2025
జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు సమర్పించాలి: పెద్దపల్లి కలెక్టర్

సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల ప్రతిపాదనలు డిసెంబర్ 22లోగా సమర్పించాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జాతర నిర్వహణపై సంబంధిత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. పంచాయతీ రోడ్ల మరమ్మతులు, క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ సరఫరా తదితర అంశాలు డిసెంబరు 22లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. స్టాండ్ బై ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని సూచించారు.
News December 18, 2025
పెద్దపల్లి జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరణ

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా(DM&HO) డా.ప్రమోద్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, అదనపు కలెక్టర్ వేణుని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇప్పటివరకు ఇన్ ఛార్జ్ వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టిన డా.వాణిశ్రీ ప్రోగ్రాం అధికారిగా పెద్దపల్లి జిల్లాలో కొనసాగుతారు.


