News April 9, 2025

జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి: సీతక్క

image

సమాజంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే నిజమైన అభివృద్ధి అని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మూడు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్‌లో ఏర్పాటు చేసిన సామాజిక అభివృద్ధి సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణలో అమలు చేస్తున్న పలు మహిళా శిశు సంక్షేమ, సామాజిక కార్యక్రమాలను సదస్సులో సీతక్క వివరించారు.

Similar News

News April 18, 2025

MNCL: ఛత్తీస్‌గఢ్ వెళ్లి దొంగను అరెస్ట్ చేశారు

image

కోర్టుకు గైర్హాజర్ అవుతున్న వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. టూ టౌన్ ఎస్సై మహేందర్ కేసు వివరాలు వెల్లడించారు. దొంగతనం కేసులో కోర్టుకు రాకుండా తప్పించుకు తిరుగుతున్న హరదీప్ సింగ్‌ను ఛత్తీస్‌గఢ్‌లో పట్టుకొని బెల్లంపల్లి తీసుకొచ్చారు. జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా జైలు శిక్ష విధించారు. అనంతరం ఆసిఫాబాద్ జైలుకు తరలించారు.

News April 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 18, 2025

గద్వాల జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు 

image

పంట పండించే ఏ రైతు నకిలీ విత్తనాలతో మోసపోకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్‌పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలోకి నకిలీ విత్తనాలు రావడం గానీ, వినియోగం కానీ జరగకుండా చూడాలని జిల్లా ఎస్పీ టి.శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరాలపై రివ్యూ సమావేశం పోలీస్ అధికారులతో నిర్వహించారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు మరింత నమ్మకం ఏర్పడాలన్నారు.

error: Content is protected !!