News April 1, 2025
జీవీఎంసీకీ ఆస్తి పన్ను రూపంలో రూ.510 కోట్లు

గ్రేటర్ విశాఖలో రూ.510కోట్లు ఆస్తిపన్ను వసూళ్లు అయినట్లు కలెక్టర్&ఇన్‌ఛార్జ్ కమీషనర్ హరీందర్ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా పన్నులు చెల్లించిన ప్రజలకు, వసూళ్లలో పాల్గొన్న జోనల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. 2023-24 సంవత్సరంకు గాను రూ.454కోట్లు వసూళ్లు చేయగా.. 2024-25లో రూ.510కోట్లు వసూళు చేయడం హర్షనీయమన్నారు.
Similar News
News April 2, 2025
విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News April 2, 2025
మధురవాడ: తల్లి, కుమార్తెపై ప్రేమోన్మాది దాడి

విశాఖలో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. కొమ్మాది సమీపంలోని స్వయంకృషి నగర్‌లో తల్లి, కూతురిపై ఒక ప్రేమోన్మాది దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో తల్లి అక్కడికక్కడే మృతిచెందిగా కుమార్తె పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 2, 2025
ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి కావాలి: కలెక్టర్

పీఎం ఆవాస్ యోజన – ఎన్టీఆర్ కాలనీల గృహనిర్మాణ పథకంలో భాగంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి అవ్వాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులకు బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగు హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు అందించి, నిర్మాణాలు చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.