News September 15, 2025

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 111 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 111 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు తీసుకున్నారు. ఇందులో అకౌంట్ విభాగానికి 02, రెవెన్యూ 11, ప్రజారోగ్యం 13, పట్టణ ప్రణాళిక 51, ఇంజినీరింగు 28, మొక్కల విభాగమునకు 03, యుజీడీ విభాగమునకు 03 కలిపి మొత్తంగా 111 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News September 15, 2025

విశాఖ బీచ్ పరిశుభ్రత లోపాలపై కమిషనర్ ఆగ్రహం

image

విశాఖ వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే ధ్యేయమని GVMC కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకు ఎక్కడా వ్యర్థాలు కనిపించకూడదని ఆదేశించారు. ఆటుపోట్లు ఎక్కువగా ఉండే పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ముందుస్తు ప్రణాళికలు వేసుకోవాలన్నారు. RK బీచ్‌లో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో బీచ్ స్వీపింగ్ యంత్రాలు నిర్వహించే ఏజెన్సీ ఫామ్‌టెక్ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

News September 15, 2025

విశాఖ డాగ్ స్క్వాడ్.. నేర నియంత్రణలో కీలకం

image

విశాఖ నగర పోలీస్ డాగ్ స్క్వాడ్‌లో 18 శునకాలు నేర నియంత్రణలో పాలుపంచుకుంటున్నాయి. వీటిలో 10 నార్కోటిక్, 6 ఎక్స్‌ప్లోజివ్, 2 ట్రాకర్ డాగ్స్ ఉన్నాయి. ఇటీవల రైల్వే స్టేషన్ పరిధిలో ఈ జాగిలాలు 41 కిలోల గంజాయిని పట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్, జీవీఎంసీ సహకారంతో కొత్తగా 8 నార్కోటిక్ శునకాలు, నూతన కెన్నెల్స్ స్క్వాడ్‌లో చేరాయి. వీటికి క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

News September 15, 2025

విశాఖ: ‘వీకెండ్‌లో స్విగ్గీ, జోమోటో రైడర్ల సమ్మె’

image

విశాఖలో స్విగ్గీ, జోమోటో రైడర్లు ప్రతి శని, ఆదివారాల్లో సమ్మె చేయాలని తీర్మానించారు. జగదాంబలో సీఐటీయూ కార్యాలయంలో రైడర్ల సమావేశం జరిగింది.‌ జోమాటో యాజమాన్యం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో? లేదో? చూస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కుమార్ అన్నారు. స్విగ్గీ యాజమాన్యం చర్చలకు రాలేదని తెలిపారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు.