News October 13, 2025

జీవీఎంసీలో పీజీఆర్ఎస్‌కు 100 వినతులు

image

జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 100 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ అదనపు కమిషనరు డి.వి.రమణమూర్తి తీసుకున్నారు. ఇందులో అడ్మినిస్ట్రేషన్ విభాగమునకు 4, రెవెన్యూ 5, ప్రజారోగ్యం 6, పట్టణ ప్రణాళిక 58, ఇంజినీరింగు 22, మొక్కల విభాగం 1, యుసిడి 04 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Similar News

News October 13, 2025

ఆక్రమణకు గురౌతున్న ఏయూ భూములు..!

image

న‌గ‌రంపాలెంలోని ఏయూ 137 ఎకరాల భూమిని ఏయూ వీసీ జి.పి రాజ‌శేఖ‌ర్‌, రిజిస్ట్రార్ రాంబాబు సోమవారం పరిశీలించారు. కొంత భూమి ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురిఅవుతోంద‌ని, మ‌రికొంత స్థ‌లంలో అనధికార రహదారి నిర్మాణం జరుగుతుండటాన్ని గుర్తించారు. ఏయూ భూముల సరిహద్దులను త్వరగా నిర్ధారించాలన్నారు. భూమిని ప‌రిర‌క్షించే విధంగా అవ‌స‌ర‌మైన‌ చర్యలను స‌త్వ‌రం చేపట్టాలని వీసీ అధికారులకు ఆదేశించారు.

News October 13, 2025

ఏయూలో ఆక‌స్మిక త‌నిఖీ చేసీన వీసీ

image

ఏయూలో ప‌లు విభాగాల‌ను వైస్ ఛాన్సెలర్ రాజ‌శేఖ‌ర్ సోమవారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. కార్యాల‌య ప‌నివేళ‌ల్లో సిబ్బంది త‌ప్ప‌నిస‌రిగా విధుల్లో ఉండాల‌ని సూచించారు. విధుల్లో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.అనంతరం ఏయూ డిస్పెన్స‌రీని సంద‌ర్శించారు.ప్ర‌తీ విద్యార్థికి అవ‌స‌ర‌మైన వైద్య‌సేవ‌ల‌ను స‌త్వ‌రం, స‌కాలంలో అందించాల‌ని సూచించారు.

News October 13, 2025

విశాఖలో పీజీఆర్ఎస్‌కు 271 వినతులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ స‌మ‌స్య‌ల‌పై మొత్తం 271 విన‌తులు అందాయి. వాటిలో రెవెన్యూ శాఖ‌కు చెందిన‌వి 82 ఉండ‌గా, పోలీసు శాఖకు సంబంధించి 15, జీవీఎంసీ సంబంధించి 86 ఉన్నాయి. ఇత‌ర విభాగాల‌కు సంబంధించి 88 వినతులు ఉన్నాయి.