News August 21, 2025
జీవీఎంసీ కౌన్సిల్ హాలును పరిశీలించిన కమిషనర్ కేతన్ గార్గ్

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌ను పరిశీలించారు. శుక్రవారం నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శి బి.వి.రమణను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ హాజరు అవునున్న తరుణంలో కౌన్సిల్ హల్‌ను పరిశీలించారు.
Similar News
News August 22, 2025
ఆగస్టు 23న స్వచ్ఛంధ్ర దినోత్సవం: కలెక్టర్

ప్రభుత్వ ఆదేశాల మేరకు 23న ‘స్వచ్ఛాంధ్ర దినోత్సవం’లో భాగంగా పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆగస్టు థీమ్ ‘వర్షాకాలం పరిశుభ్రత’ అని తెలిపారు. డెంగ్యూ, మలేరియా నివారణకు కాలువల శుభ్రపరిచడం, ఫాగింగ్, నీటి నాణ్యత పరీక్ష, టాయిలెట్ల పరిశుభ్రత, అవగాహనా కార్యక్రమాలు, పాఠశాలల్లో ప్రచారాలు నిర్వహించాలని గురువారం సూచించారు.
News August 21, 2025
మల్కాపురం: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

మల్కాపురంలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెంలో ఉంటున్న కనకరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ మధ్య కాలంలోనే అతని భార్యకు ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. దీంతో ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News August 21, 2025
బీచ్ రోడ్డు: బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకో బాస్..!

బీచ్ రోడ్డులో సబ్‌మెరిన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. పూర్ణ మార్కెట్ ప్రాంతానికి చెందిన కె.సాగర్(26) స్నేహితుడితో కలిసి పార్క్ హోటల్ నుంచి RK బీచ్ వైపు బైక్‌పై వస్తున్నాడు. ముందు ఉన్న బైక్ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆ వాహనాన్ని వీరు ఢీకొట్టి పడిపోయారు. హెల్మెట్ లేకపోవడంతో సాగర్ తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతూ గంట వ్యవధిలో మరణించాడు. త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.