News September 26, 2025
జీవీఎంసీ జోన్లు పదికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు

జీవీఎంసీ జోన్లను పదికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొత్త జోన్లు..
➤ భీమిలి – 1, 2, 3, 4 ➤మధురవాడ – 5, 6, 7, 8, 98 ➤ఈస్ట్ – 9 నుంచి 23, 28
➤నార్త్ – 14, 24, 25, 26, 42 నుంచి 51, 53, 54, 55 ➤సౌత్ – 27 నుంచి 39, 41
➤వెస్ట్ – 40, 52, 56 నుంచి 63, 89 నుంచి 92 ➤పెందుర్తి – 88, 93 నుంచి 97
➤గాజువాక – 64 నుంచి 76, 86, 87 ➤అగనంపూడి – 77, 78, 79, 85
➤అనకాపల్లి – 80 నుంచి 84
Similar News
News September 26, 2025
ఏయూలో మెడికల్ ఆఫీసర్ ఇంటర్వ్యూలు

ఏయూలో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన తాత్కాలిక నియామకాలకు పరిపాలన భవనంలో శుక్రవారం ఇంటర్వ్యూ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు 10 మందికి పైగా హాజరయ్యారు. శనివారం కూడా ఇంటర్వ్యూల ప్రక్రియ కొనసాగుతుంది. ఏయూ డిస్పెన్సరీలో కాంట్రాక్ట్ విధానంలో వీరిని నియమిస్తున్నారు.
News September 26, 2025
అక్టోబర్ 1న ఏయూకు సెలవు

ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అక్టోబర్ 1న సెలవు దినంగా ప్రకటించారు. మహర్నవమి సందర్భంగా ఆరోజు సెలవు ప్రకటించినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ప్రకటన విడుదల చేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా అక్టోబర్ 11వ తేదీన విశ్వవిద్యాలయం పనిచేస్తుందన్నారు. అక్టోబర్ 15న ఏయూ స్నాతకోత్సవం జరగనున్న నేపథ్యంలో 11వ తేదీన వర్సిటీ యథావిధిగా పనిచేస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News September 26, 2025
కంచరపాలెంలో అర్ధరాత్రి దారుణ హత్య

కంచరపాలెం సమీపంలోని తిక్కవారిపాలెంలో నాగల్ గణేష్ అనే యువకుడ్ని దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో యువకుల మధ్య జరిగిన ఘర్షణలో గణేష్‌ను హతమార్చారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.