News March 19, 2025

జీవీఎంసీ బడ్జెట్‌ సమావేశం ఏర్పాటు చేయండి: మేయర్

image

జీవీఎంసీ బడ్జెట్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కోరినట్లు విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి బుధవారం తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి అందజేశామన్నారు. అయితే అసెంబ్లీ మార్చి 22, 29 తేదీల్లో శాసనసభకు, పార్లమెంటుకు సెలవు ఉంటుందని ఆరోజు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.

Similar News

News May 7, 2025

దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలని కలెక్టర్ ఆదేశాలు

image

దివ్యాంగుల సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ శనివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. దివ్యాంగుల చట్టాలు పక్కాగా అమలు జరగాలన్నారు. దివ్యాంగ బాలలను పాఠశాలలో చేర్పించాలని సూచించారు. 18 ఏళ్ల లోపు దివ్యాంగుల పెన్షన్ డేటాను సేకరించాలని ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగుల పూర్తి సమాచారం సేకరించాలన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రాంతాల్లో ప్రత్యేక ర్యాంపులు నిర్మించాలని సూచించారు.

News May 7, 2025

సింహాచలం చందనోత్సవానికి 151 ప్రత్యేక బస్సులు

image

ఈనెల 30న సింహాచలంలో జరగనున్న చందనోత్సవానికి 151 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను సిద్ధం చేసినట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పల నాయుడు తెలిపారు. శనివారం ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. చందనోత్సవానికి కొండపైకి వెళ్లే బస్సులు కండిషన్‌లో ఉండేలా చూడాలని ఆదేశించారు. గోశాల నుంచి RTC కాంప్లెక్స్, పాత పోస్ట్‌ ఆఫీస్, RK బీచ్, కొత్తవలస, చోడవరం, అడవివరం, హనుమంతవాక, విజయనగరం నుంచి బస్సులు నడపనున్నారు.

News May 7, 2025

రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగానికి ప్రాధాన్యత: మంత్రి సత్య కుమార్

image

రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తోందని ఆ శాఖ మంత్రి సత్య కుమార్ వెల్లడించారు. శనివారం ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రంలో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. విశాఖను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.