News July 8, 2025

జీవో 49ని రద్దు చేయాలి: ADB Ex MP

image

ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ పేరిట జారీ చేసిన జీవో 49 ఆదివాసీల హక్కులను కాలరాసేలా ఉందని మాజీ ఎంపీ సోయం బాపురావు పేర్కొన్నారు. ఈ జీవోను వెంటనే రద్దుచేసి గిరిజన, గిరిజనేతరులకు స్వేచ్ఛ కల్పించాలని డిమాండ్ చేశారు. HYDలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని మంగళవారం కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

Similar News

News July 8, 2025

CBSE: సప్లిమెంటరీ హాల్‌టికెట్లు విడుదల

image

10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షల హాల్‌టికెట్లను CBSE రిలీజ్ చేసింది. ప్రైవేట్ విద్యార్థులు వెబ్‌సైట్‌లో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. రెగ్యులర్ స్టూడెంట్స్ తమ స్కూళ్లలో హాల్‌ టికెట్లు కలెక్ట్ చేసుకోవాలని పేర్కొంది. కాగా ఈనెల 15 నుంచి 10, 12వ తరగతుల సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతాయి. 10 నుంచి 15వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి.

News July 8, 2025

ధరూర్: జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

image

ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేయడంతో ధరూర్ మండలం రేవులపల్లి వద్ద ఉన్న జూరాల ప్రాజెక్టుకు మంగళవారం సాయంత్రం ఇన్ ఫ్లో 1.25 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 14 గేట్లు ఓపెన్ చేసి 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పవర్ హౌస్‌కు 29,053, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400 క్యూసెక్కులు మొత్తం 1,26,844 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

News July 8, 2025

నేరాలు జరగకుండా పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేయాలి: SP

image

ముందస్తు సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకొని, రాత్రిపూట జరిగే దొంగతనాలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరగకుండా పటిష్ఠ నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ ఆర్.గంగాధర్ రావు అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో సీసీఎస్ పోలీసులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. దొంగతనాలకు పాల్పడే వారి ఆటలకు చెక్ పెడుతూ, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు చేసే వారిపై నిఘా ఉంచాలన్నారు.