News June 14, 2024

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికికి ప్రమాదం: BJP

image

జీహెచ్ఎంసీ పరిధిని పెంచితే రంగారెడ్డి జిల్లా ఉనికి దెబ్బతినే ప్రమాదం ఉందని BJP రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం HYD హైదర్‌గూడలోని NSSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని అన్నారు.

Similar News

News March 1, 2026

HYD: Way2Newsలో కథనం.. అధికారుల్లో చలనం

image

MMC ఘట్‌కేసర్‌ సర్కిల్ ముత్వెల్లిగూడలో నీటి లీకేజీపై Way2News కథనానికి అధికారులు స్పందించి మరమ్మతులు చేయించారు. ‘<<19260987>>నమ్మండి.. ఇది రోడ్డే..!<<>>’ శీర్షికన శనివారం పబ్లిష్ అయిన కథనంతో HMWSSB మల్కాజిగిరి ED పంకజ, CGM (E) సంతోష్ సదరు ప్రాంతాన్ని సందర్శించారు. 200mm డయా పైపు నీటి లీకేజీ సమస్యను పరిష్కరించారు. స్పందించి సమస్య తీర్చిన అధికారులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

News March 1, 2026

APPLY: HYD: 108లో ఉద్యోగాలు

image

EMRI(108) సంస్థలో పైలట్ & EMT ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ సెట్ తీసుకొని ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. డ్రైవర్‌కు అర్హతలు: SSC పాస్, 23-35yrs (LMV)బ్యాడ్జి నంబర్ ఉండాలి. EMTఅర్హతలు: MLT, DMLT, ANM, MPHA, GNM, B.SC, BZC 30 yrs లోపు వారు కింగ్ కోఠి 108 రీజనల్ ఆఫీస్ 10am- 2pm వరకు 9100799259లో సంప్రదించండి.

News March 1, 2026

రేపు HYDకి రాహుల్ గాంధీ

image

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రేపు HYDకు రానున్నారు. ఇక్కడి నుంచి వికారాబాద్ జిల్లా అనంతగిరిలో జరుగుతున్న DCCల శిక్షణ కార్యక్రమంలో వారితో మాట్లాడనున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు దిశనిర్దేశం చేయనున్నారు. మరోవైపు రాహుల్ పర్యటన దృష్ట్యా కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. పర్యటనంతా పటిష్ఠమైన భద్రతా చర్యల నడుమ చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.