News January 24, 2025
జుక్కల్: చికెన్ కోసం వెళ్లి మృత్యు ఒడిలోకి..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రానికి చెందిన నాగనాథ్ అనే వ్యక్తి ఈనెల 23న సాయంత్రం పెద్ద ఏడ్గి గ్రామానికి బైక్‌పై చికెన్ కోసం వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 18, 2026
షీలా నగర్: రన్నింగ్‌లో ఊడిన స్కూటీ చక్రం.. మహిళ మృతి

షీలా నగర్ టూ పోర్ట్ రోడ్డులో ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్కూటీ టైరు ఊడిపోవడంతో కిందపడిన దాసరి ఇలామాజీ(35) తలకు తీవ్రగాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రహదారి మధ్యలో కానిస్టేబుల్ గంటా గౌరీనాయుడు ఆమెను బైక్ లిఫ్ట్ అడిగి ఎక్కాడు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News February 18, 2026
పోలీసుల పల్లెనిద్ర.. మీ సమస్యలను వారితో చెప్పుకోండి!

ప్రజలకు చేరువయ్యేందుకు జిల్లావ్యాప్తంగా పోలీస్ అధికారులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. అమలాపురం మండలం పేరూరులో టౌన్ SI కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం వరకు ఈ కార్యక్రమం జరిగింది. గ్రామంలోని రచ్చబండ వద్ద స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోలీసులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
News February 18, 2026
KNR: పుర పోరు.. మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జయకేతనం

ఉమ్మడి KNR జిల్లాలోని 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. KNRలో BJP, సిరిసిల్ల, రాయికల్‌లో BRS, జమ్మికుంటలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించగా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ గెలుపును కైవసం చేసుకొంది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు, అడ్లూరి ప్రచారాలు గెలుపునకు బాటలు వేశాయి.


