News August 17, 2025
జుక్కల్: బిందెలతో క్యూరింగ్.. ఐడియా అదుర్స్

సాధారణంగా పిల్లర్ల క్యూరింగ్ అంటే గుడ్డలు చుట్టి నీళ్లు కొట్టడం చూస్తుంటాం. కానీ, జుక్కల్ మండలం పెద్దగుల్లలో జరుగుతున్న ఒక నిర్మాణంలో అందుకు భిన్నంగా పిల్లర్లపై బిందెలు పెట్టారు. పిల్లర్ల పైన ఏర్పాటు చేసిన బిందెలకు చిన్న రంధ్రాలు చేసి, వాటిలో నీటిని నింపుతున్నారు. ఈ రంధ్రాల నుంచి నీరు బిందువుల రూపంలో కిందకి జారి, పిల్లర్లకు క్యూరింగ్ అవుతుంది. ఈ వినూత్న పద్ధతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Similar News
News August 17, 2025
‘గీతాంజలి’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?

నాగార్జున కెరీర్‌లో ‘గీతాంజలి’ (1989) ఓ క్లాసిక్. మణిరత్నం తెరకెక్కించిన ఆ చిత్రంలో గిరిజ హీరోయిన్. తాజాగా జగపతి బాబు హోస్ట్ చేసిన ఓ షోలో ఆ సినిమా విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘నాకు అది తొలి సినిమా. నాగార్జునకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. సౌమ్యుడు. అతడు లెజెండ్‌కు తక్కువేం కాదు. నా ఫస్ట్ మూవీలో సహ నటుడిగా ఉన్నందుకు థాంక్యూ’ అని చెప్పారు. చాలా ఏళ్ల తర్వాత ఆమె స్క్రీన్‌పై కనిపించడంతో ఫొటో వైరలవుతోంది.
News August 17, 2025
నిర్మల్: రేపటి ప్రజావాణి రద్దు

జిల్లాలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి ఫిర్యాదులు చేసేవారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News August 17, 2025
మెదక్: గణేశ్ మండపాల వివరాలు ఆన్‌లైన్ తప్పనిసరి: ఎస్పీ

రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మెదక్ ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గణేశ్ మండప నిర్వాహకులు, సభ్యులు, కమిటీ సభ్యులు, పోలీస్ శాఖ వారు రూపొందించిన వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/index.htmలో వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.