News March 17, 2025
జుక్కల్: హోలీ ఆడి, స్నానానికి వెళ్లి శవమై తేలాడు

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన ప్రకాష్ దేవాడ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ నెల 14న హోళీ ఆడి తన తోటి మిత్రులతో దేశ్ముక్ చెరువులో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని ఈ నెల 16న శవమై తేలినట్లు తల్లి చందాబాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.
Similar News
News November 6, 2025
‘తొలిప్రేమ’ ఓ ట్రైనింగ్ సెషన్: అధ్యయనం

ఫస్ట్ లవ్ కొందరికి మధుర కావ్యం. మరికొందరికి తీరని వ్యథ. ఏదేమైనా దీనికి ముగింపు ఉండదని, ఇది జీవిత పాఠాలను నేర్పించడానికేనని ఓ అధ్యయనంలో తేలింది. మొదటి ప్రేమ గమ్యం కాదని, ఇది కేవలం భావోద్వేగాలు, అంచనాలు & హార్ట్ బ్రేకింగ్ అనుభవాన్ని పరిచయం చేసేదని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘ట్రైనింగ్ సెషన్’గా వారు అభివర్ణించారు. ఈ అనుభవంతోనే భవిష్యత్తులో వచ్చే సంబంధాలకు సిద్ధమవుతారని అధ్యయనం చెబుతోంది.
News November 6, 2025
ములుగు జిల్లాలో 184 కొనుగోలు కేంద్రాలు

ములుగు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణకు 184 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. మహిళా సంఘాలు 59, ప్రాథమిక సహకార సంఘాలు 99, రైతు ఉత్పాదక సంస్థ 8, గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో 18 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేసి, మద్దతు ధర అందించనున్నట్లు తెలిపారు.
News November 6, 2025
ధాన్యం అమ్మిన రోజే అకౌంట్లలో డబ్బులు జమ

AP: ధాన్యం అమ్మిన రైతులకు అదేరోజు వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. దీని కోసం 35 బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రోజూ నాలుగుసార్లు.. అంటే మధ్యాహ్నం 12 గంటలకు, 2 గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు రైతుల ఖాతాల్లో డబ్బులు పంపించేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెలవు రోజుల్లో పేమెంట్ గేట్‌వే పనిచేయదు కనుక, ఆ డబ్బులు మరుసటి రోజు జమ అవుతాయన్నారు.


