News March 17, 2025

జుక్కల్: హోలీ ఆడి, స్నానానికి వెళ్లి శవమై తేలాడు

image

జుక్కల్ మండలంలోని పెద్ద గుల్ల గ్రామానికి చెందిన ప్రకాష్ దేవాడ అనే యువకుడు చెరువులో పడి మృతి చెందినట్లు జుక్కల్ ఎస్ఐ భువనేశ్వర్ తెలిపారు. ఈ నెల 14న హోళీ ఆడి తన తోటి మిత్రులతో దేశ్ముక్ చెరువులో స్నానానికి వెళ్లి బురదలో ఇరుక్కుని ఈ నెల 16న శవమై తేలినట్లు తల్లి చందాబాయి ఫిర్యాదు చేసిందని అన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.

Similar News

News March 17, 2025

హాట్ టాపిక్‌గా కేటీఆర్, మల్లన్న భేటీ

image

కేటీఆర్, హరీశ్, తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో భేటీ కావడం రాజకీయంగా ఆసక్తి నెలకొంది. నిత్యం విమర్శలు, ప్రతి విమర్శలతో ఉప్పనిప్పులా ఉండే వీరి భేటీపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని మల్లన్న వారిని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోనే హాట్ టాపిక్‌గా మారిన వీరి అనూహ్య భేటీపై మీ కామెంట్.

News March 17, 2025

ఫేక్ పాస్‌పోర్టు, వీసాతో ప్రవేశిస్తే 7 ఏళ్లు జైలు, ఫైన్!

image

సరికొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే దేశంలోకి అక్రమంగా ప్రవేశించేవారికి చుక్కలు కనిపించడం ఖాయమే. ఫేక్ పాస్‌పోర్టు లేదా వీసాతో దేశంలోకి ప్రవేశించేవారు, ఉండేవారు, విడిచివెళ్లే వారు గరిష్ఠంగా ఏడేళ్లు జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఎయిర్‌లైన్స్, షిప్స్ ముందస్తుగా ప్రయాణికులు, స్టాఫ్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది.

News March 17, 2025

చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టండి: రేవంత్

image

TG: చర్లపల్లి టర్మినల్‌కు పొట్టిశ్రీరాములు పేరు పెట్టాలని CM రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డికి లేఖ రాస్తామని చెప్పారు. టర్మినల్‌కు ఆయన పేరు పెట్టి దేశభక్తి చాటుకోవాలని కోరారు. బల్కంపేటలోని ప్రకృతి వైద్య చికిత్స ఆలయానికి రోశయ్య పేరు పెడతామన్నారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.

error: Content is protected !!