News June 30, 2024
జులై 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్: SFI

జులై 4వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడనున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీకి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ.. దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. వీటితో పాటు సెంట్రల్ యూనివర్సిటీలలో విద్యార్థి సంఘ నాయకులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, స్కూల్స్ మూసివేతను ఆపాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు.
Similar News
News January 3, 2026
ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచాలి: DEO

తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకాన్ని పెంచేలా ఉపాధ్యాయుల బోధన ఉండాలని DEO సలీమ్ బాషా సూచించారు. బ్రాడీపేటలోని శారదానికేతన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను శనివారం DEO ఆకస్మికంగా తనిఖీ చేశారు. పుస్తకాల పఠనం, ఉత్తమ మార్కుల్లో విద్యార్థులు ఆకాశమే హద్దుగా నిలిచేలా తీర్చిదిద్దాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని అన్నారు.
News January 3, 2026
GNT: సీఎం రాక.. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

సీఎం చంద్రబాబు ఈ నెల 5న గుంటూరు రానున్న నేపథ్యంలో SP వకుల్ జిందాల్‌తో కలిసి కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా శనివారం ఏర్పాట్లు పరిశీలించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల చివరి రోజు సీఎం విచ్చేయనున్నారు. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో పర్యటన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 3, 2026
GNT: ప్రముఖులకు స్వాగతం పలికిన అధికారులు

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటమ్ శ్రీ నరసింహ, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుకు గుంటూరులో ఘన స్వాగతం లభించింది. శ్రీ సత్యసాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు వారు విచ్చేశారు. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ అతిథులకు స్వాగతం పలికారు.


