News November 26, 2025

‘జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఉత్తీర్ణతే లక్ష్యం’

image

రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంపొందించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ సంకల్పం-2026 పేరుతో 50 రోజుల ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ పి.రంజిత్ బాషా ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా వృత్తి విద్యాశాఖధికారి ఆర్.సురేష్ మంగళవారం తెలిపారు. విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని గణనీయంగా మెరుగుపరచడమే సంకల్పం లక్ష్యం అన్నారు.

Similar News

News February 4, 2026

మందస: రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ సూసైడ్

image

రైలు కింద పడి ఆర్మీ హవల్దార్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మందస(M)హరిపురం రైల్వే లైన్ సమీపంలో బుధవారం జరిగింది. రాధాకృష్ణపురానికి చెందిన జోగారావు(36) ఆర్మీ హవల్దార్‌గా జమ్మూలో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల సెలవులకు ఇంటికి వచ్చారు. కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టానికి పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు.

News February 4, 2026

శ్రీకాకుళం: ఇవాళ సాయంత్రం వరకే ఈ ఛాన్స్

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సుమారు 10 బార్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఈ రోజు సాయంత్రం వరకే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ తిరుపతిరావు ఇటీవల ఓ ప్రకటనలో తెలియజేశారు. శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, ఆమదాలవలస మండలాల్లో బార్‌లకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

News February 4, 2026

శ్రీకాకుళం: గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళంలోని బలగ మెట్టు వద్ద మంగళవారం గుర్తుతెలియని యాచకుడు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. స్థానికంగా చిత్తుకాగితాలు ఏరుకుని భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ఈ మేరకు బలగ మెత్తులోని ఒక ఆలయం వద్ద అస్వస్థతకు గురై మృతిచెందాడు. ఈ మేరకు మృతదేహాన్ని శ్రీకాకుళం 2టౌన్ పోలీసులు పరిశీలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.