News February 17, 2025
జూనియర్ పై సీనియర్లు కత్తితో దాడి

టీవీలో పెట్టిన సినిమా చూడలేదంటూ జూనియర్‌పై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు కత్తితో దాడి చేశారు. పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతుండగా వీఎం బంజర పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 11, 2025
విద్యతోనే పేదరికం నిర్మూలన: కలెక్టర్ అనుదీప్

విద్య ద్వారానే పేదరికం నుంచి శాశ్వత విముక్తి సాధ్యమని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ప్రతి వర్గానికి విద్య అందేలా కృషి చేశారని తెలిపారు. మైనారిటీ గురుకులాల ద్వారా బాలికల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
News November 11, 2025
ఈవీఎం గోడౌన్ వద్ద భద్రత పటిష్టం చేయాలి: కలెక్టర్

ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేశారు. సీల్స్, సీసీ కెమెరాలు, అగ్నిమాపక పరికరాలు, సైరన్ పనితీరును పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టులు, విధులను తెలుసుకొని, భద్రతాపరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సూచించారు. తనిఖీలో రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ, ఎన్నికల సూపరింటెండెంట్ రాజు పాల్గొన్నారు.
News November 11, 2025
ఖమ్మం జిల్లాలో 441 ఇందిరమ్మ ఇళ్లకు సమస్య

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు నిలిచిపోవడంతో ఖమ్మం జిల్లాలో 441 మంది లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 52 మందికి నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయని, 260 మందికి గతంలో ఇల్లు మంజూరైందని అధికారులు బిల్లులు నిలిపివేశారు. మరో 129 ఇళ్లు బేస్మెంట్ పూర్తి కాగా అధికారులు పరిశీలించాల్సి ఉంది. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.


