News January 13, 2026
‘జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు అఫైర్’.. మాజీ భర్త సంచలన ఆరోపణలు

తనను మోసం చేసి ఆస్తులు లాక్కున్నారన్న మేరీ కోమ్ <<18824314>>ఆరోపణల్లో<<>> నిజం లేదని ఆమె మాజీ భర్త కరుంగ్ ఆంఖోలర్ అన్నారు. ‘ఆమెకు జూనియర్ బాక్సర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. ఫ్యామిలీ సర్దిచెప్పినా మళ్లీ మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది. అందుకు నా దగ్గర వాట్సాప్ మెసేజ్ ప్రూఫ్‌లు కూడా ఉన్నాయి. ఒంటరిగా ఉంటూ అక్రమ సంబంధాలు నడిపించాలనుకుంది. అందుకే విడాకులు తీసుకుంది’ అని IANS ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News February 6, 2026
ఇంట్లో దేవుళ్ల విగ్రహాలు పగిలిపోతే ఏం చేయాలి?

ఇళ్లలో పూజించిన దేవతా విగ్రహాలు పగిలినా, పటాలు చిరిగినా వాటిని ఎక్కడపడితే అక్కడ పడేయకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాటిని పారే నీటిలో నిమజ్జనం చేయాలని చెబుతున్నారు. చిరిగిన పటాలను పవిత్ర అగ్నిలో ఆహుతి చేయడం శ్రేయస్కరమని అంటున్నారు. ఏ పద్ధతిని అనుసరించినా దైవభావంతో గౌరవప్రదంగా చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆధ్యాత్మిక విలువలను కాపాడిన వారవుతారు అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>
News February 6, 2026
కిచెన్‌లో వాడే సిలికాన్ మూతలు సేఫేనా?

కిచెన్‌లో ఈ మధ్య సిలికాన్ మూతలు కామన్‌గా కనిపిస్తున్నాయి. వాడడానికి, క్లీన్ చేయడానికి ఈజీగా ఉండడమే దీనికి కారణం. అయితే ఇవి సేఫేనా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతోంది. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం.. సర్టిఫైడ్ ఫుడ్ గ్రేడ్ సిలికాన్‌తో తయారు చేసిన మూతలు సురక్షితమే. అయితే వాటిని నార్మల్ కిచెన్ టెంపరేచర్ దగ్గర మాత్రమే వాడాలి. లేదంటే ప్లాస్టిక్ తరహాలోనే ఆరోగ్యానికి ముప్పు తలపెడతాయి.
News February 6, 2026
ఆ ఒక్క స్టార్టప్ విలువ.. మన 10 బడా IT కంపెనీల కంటే ఎక్కువ!

ఆంథ్రోపిక్ పేరు ఇప్పుడు IT ఇండస్ట్రీలో మారుమోగుతోంది. ఈ స్టార్టప్ తెచ్చిన టూల్‌తో ఇండియన్ IT కంపెనీల షేర్లు బెంబేలెత్తిపోయాయి. ఈ నేపథ్యంలో SM వేదికగా ఒక ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. రీసెంట్ ఫండింగ్ తర్వాత ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ $350 బిలియన్లకు చేరింది. అదే టైమ్‌లో ఇండియాలోని టాప్-10 IT కంపెనీల విలువ దాదాపు $330 బిలియన్లకు పడిపోయింది. అంటే ఆ ఒక్క కంపెనీ వాల్యూ మన 10 కంపెనీల కంటే ఎక్కువ!


