News February 28, 2025
జూపార్కు ధరలు పెంపు.. రేపటి నుంచి అమల్లోకి

HYD నెహ్రూ జూలాజికల్ పార్కు ప్రవేశ టికెట్లతో పాటు అన్ని రకాల టికెట్లపై ధరలను రాష్ట్ర అటవీ శాఖ ఆదేశాల మేరకు జూపార్క్ అధికారులు పెంచారు. రేపటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి వస్తాయని జూపార్క్ క్యూరేటర్ వసంత తెలిపారు. 2 ఏళ్ల తర్వాత జూ పార్క్ టికెట్ల ధరలను పెంచారు. జూపార్క్ ప్రవేశ టికెట్ రూ.100, చిన్న పిల్లలకు రూ.50లతో పాటు జూలోని మరిన్నింటికి ధరలు పెంచారు.
Similar News
News February 28, 2025
అఫ్గాన్‌కు మ్యాక్స్‌వెల్ గండం?

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మరికాసేపట్లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ICC మెగా టోర్నీల్లో మ్యాక్సీ వీరవిహారం చేస్తూ అఫ్గాన్‌కు పీడకల మిగిలిస్తున్నారు. అఫ్గాన్‌పై CWC 2015లో 88, T20 WC 2022లో 54*, CWC 2023లో 201*, టీ20 WC 2022లో 59 రన్స్ బాదారు. దీంతో మరోసారి అతడి బారిన పడకుండా అఫ్గాన్ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా ఆయనను తక్కువ స్కోరుకే కట్టడి చేయాలని భావిస్తోంది.
News February 28, 2025
నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలి: సెంట్రల్ జోన్ డీసీపీ

సెంట్రల్ జోన్ నేరాల నియంత్రించేందుకు పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది ముమ్మరంగా పెట్రోలింగ్ చేపట్టాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అధికారులకు సూచించారు. సెంట్రల్ జోన్‌కు చెందిన పోలీస్ అధికారులతో సెంట్రల్ జోన్ డీసీపీ నేర సమీక్ష నిర్వహించారు. ప్రధానంగా పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని భాదితులకు న్యాయం చేయాలని డీసీపీ అధికారులకు తెలిపారు.
News February 28, 2025
ములుగు: బోనస్ ఇంకెప్పుడు ఇస్తారు?

ములుగు జిల్లాలో రైతులకు సకాలంలో వరి ధాన్యం బోనస్ డబ్బులు ఖాతాల్లో జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 11,379 మంది రైతులు నుంచి వరి ధాన్యాన్ని సేకరించగా.. 4,885 మంది రైతులకు రూ.15.64 కోట్లు చెల్లించారు. మిగిలిన 6,494 మంది రైతులకు రూ.19.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు చేసి ఇన్ని రోజులు అవుతున్నా.. బోనస్ ఇంకెప్పుడు ఇస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.